Mancherial district : తెలంగాణ గ్రామీణ బ్యాంకును ప్రశంసించిన దొంగ.. ఇదేం విడ్డూరం? చదవండి
ఓ దొంగ బ్యాంకు దోపిడీకి ప్రయత్నించాడు. అతని ప్రయత్నం సక్సెస్ కాలేదు. వెనుతిరిగి వెళ్తూ ఆ బ్యాంకుపై ప్రశంసలు కురిపిస్తూ ఓ నోట్ వదిలి వెళ్లాడు. ఈ వింత సంఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.

Mancherial district
Mancherial district : బ్యాంకులో దొంగతనం చేయాలని ఓ దొంగ చాలా ప్రయత్నించాడు. కానీ పని కాలేదు. అయితే ఆ దొంగ బ్యాంకుపై ప్రశంసలు కురిపించాడు. మంచి బ్యాంకు అంటూ నోట్ రాసి పెట్టి వెళ్లాడు. ఈ వింత సంఘటన ఎక్కడ జరిగిందంటే?
Jet Airways : బ్యాంకు మోసం కేసులో జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ అరెస్ట్
మంచిర్యాల జిల్లా నెన్నాల్ మండలంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్‌లో జరిగిన ఓ సంఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దొంగతనం చేయడానికి రాత్రివేళ ఆ బ్యాంకులోకి ప్రవేశించాలని ప్రయత్నించిన ఓ దొంగ విఫలమయ్యాడు. అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ బ్యాంక్ భద్రతను ప్రశంసిస్తూ ఒక నోట్ పెట్టి వెళ్లాడట.
Overnight Millionaire : చెత్తలో దొరికిన 60 ఏళ్లనాటి బ్యాంకు పాస్ బుక్.. ఆ తరువాత ఏం జరిగిందంటే?
విధులకు వచ్చిన బ్యాంకు ఉద్యోగులు ఆ దొంగ రాసిన నోట్ చదివి అవాక్కయ్యారట. ఆ నోట్ లో ‘నా వేలి ముద్రలు ఉండవు. మంచి బ్యాంకు. ఒక్క రూపాయి కూడా పొందలేకపోయాను.. కాబట్టి నన్ను పట్టుకోవద్దు’ అని రాసి ఉందట. ఈ విషయాన్ని బ్యాంకు ఉద్యోగులు స్ధానిక పోలీసులతో పంచుకున్నారట. దొంగ తనను గుర్తించకుండా జాగ్రత్త పడినప్పటికీ బ్యాంకు సీసీ కెమెరాలో దొంగతనానికి అతను ప్రయత్నించిన ఫుటేజీ మాత్రం రికార్డైందట. దాని ఆధారంగా పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన తర్వాత బ్యాంకు భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని బ్యాంకు అధికారులు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.