Road Roller : ఏకంగా రోడ్డు రోలర్‌నే చోరీ చేశారు

బ్రిడ్జీ పనులకు బిల్లులు రాకపోవడంతో రోడ్డు రోలర్‌ ఓనర్‌ పనుల కోసం వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు. తర్వాత రోడ్‌ రోలర్‌ కోసం వస్తే.. అక్కడ కనిపించలేదు.

Road Roller : ఏకంగా రోడ్డు రోలర్‌నే చోరీ చేశారు

Roller (1)

Updated On : January 27, 2022 / 8:20 AM IST

Thieves stole a road roller : వికారాబాద్‌ జిల్లా తాండూరులో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా రోడ్డు రోలర్‌ను చోరీ చేశారు. బ్రిడ్జి పనుల కోసం తీసుకెళ్లి.. అక్కడే కొన్ని నెలలు వదిలేసిన రోలర్‌ను లారీలో ఎక్కించి పాత సామాన్ల షాపుకు తరలించారు కేటుగాళ్లు. పాత సామాన్ల కొట్లలో విడిభాగాలు కనిపించడంతో రోడ్డు రోలర్‌ ఓనర్‌ షాక్‌ అయ్యాడు.

స్థానిక గుండ్లమడుగు తండాకు చెందిన నర్సింహారెడ్డి 5 నెలల క్రితం బ్రిడ్జ్‌, పనులను చేపట్టారు. ఈ పనులకు బిల్లులు రాకపోవడంతో పనుల కోసం వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు. తర్వాత రోడ్‌ రోలర్‌ కోసం వస్తే.. అక్కడ కనిపించలేదు. జినుగుర్తికి చెందిన షాబోద్దిన్‌ రోలర్‌ను లారీలో తీసుకెళ్లారని గ్రామస్తులు చెప్పారు.

Karimnagar Vaccination : వ్యాక్సినేషన్ లో కరీంనగర్ రికార్డు.. రెండో డోసు పంపిణీ వంద శాతం పూర్తి

అతన్ని ఆరా తీస్తే.. కొంతమంది తాము రోలర్‌ను కొనుగోలు చేశామని చెప్పారని.. తాను కేవలం లారీని కిరాయికి తీసుకెళ్లానని చెప్పాడు. పాత సామాగ్రీ గోదాముకు వెళ్లి చూస్తే.. రోలర్‌ విడి భాగాలు కనిపించాయి.