Telangana : బీ అలర్ట్, మూడు, నాలుగు వారాలు కీలకం – డీ.హెచ్ శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోందని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డీహెచ్ వో శ్రీనివాస్ వెల్లడించారు. అయితే..పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదని, వచ్చే మూడు, నాలుగు చాలా కీలకమని అభివర్ణించారు.

Telangana :  బీ అలర్ట్, మూడు, నాలుగు వారాలు కీలకం – డీ.హెచ్ శ్రీనివాస్

Telangana corona

Updated On : April 28, 2021 / 5:22 PM IST

Health Director Srinivas :  తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోందని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డీహెచ్ వో శ్రీనివాస్ వెల్లడించారు. అయితే..పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదని, వచ్చే మూడు, నాలుగు చాలా కీలకమని అభివర్ణించారు. మే నెల చివరి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గత కొన్ని రోజులు నుంచి వైరస్ ఎక్కువ విస్తరించడం లేదని, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుదల లేదన్నారు. ఒక విధంగా స్థిరత్వం వచ్చినట్లు చెప్పుకోవచ్చన్నారు. అయతే..తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని, రాష్ట్రంలో వైరస్ తగ్గుముఖం పట్టేందుకు వచ్చే మూడు, నాలుగు వారాల సమయం పడుతుందన్నారు.

కరోనా వైరస్ గురించి ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, ప్రతొక్కరూ మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరూ కూడా అలసత్వం ప్రదర్శించవద్దని, కోవిడ్ లక్షణాలు ఉన్నవారు మాత్రమే పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఏదో తనకు వైరస్ ఉందంటూ..కోవిడ్ కేంద్రాలకు వెళుతున్నారని, ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నారు. దీనివల్ల పరీక్షలు చేసుకోవాల్సిన వారు దూరం అవుతున్నారని తెలిపారు. అనవసరంగా వెళ్లడం వల్ల వ్యాధి బారిన పడుతున్నారని ఆయన తెలిపారు.