Three Killed : ప్రమాదవశాత్తు చెరువులో పడి తాత, తండ్రి, మనవడు మృతి

చెరువులో పడి తాత, తండ్రి, మనుమడు మృతి చెందారు. మృతులు కృష్ణమూర్తి, నాగరాజు, దీపక్ గా గుర్తించారు. ఒకరిని కాపాడేందుకు మరొకరు చెరువులో దిగి ముగ్గురు మృతి చెందారు.

Three Killed : ప్రమాదవశాత్తు చెరువులో పడి తాత, తండ్రి, మనవడు మృతి

Pond

Updated On : March 13, 2022 / 4:53 PM IST

Three members killed : వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని చిన్నగురిజాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెరువు మూడు తరాలను మింగేసింది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. చెరువులో పడి తాత, తండ్రి, మనుమడు మృతి చెందారు. మృతులు కృష్ణమూర్తి, నాగరాజు, దీపక్ గా గుర్తించారు. ఒకరిని కాపాడేందుకు మరొకరు చెరువులో దిగి ముగ్గురు మృతి చెందారు. ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవాళ ఉదయం తాత, తండ్రి, తనయుడు.. ముగ్గురూ కలిసి మొక్కజొన్న చేను దగ్గరికి వెళ్లారు. చేతికొచ్చిన మొక్కజొన్న పంటను కోసుకుని బస్తాలు నింపిన తర్వాత ముగ్గురు కూడా సమీపంలోని చెరువు గట్టు వద్దకు వెళ్లి కాళ్లు, చేతులు కడుక్కుంటున్నారు. మొదటగా నాగరాజు అనే వ్యక్తి కాళ్లు, చేతులు కడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు జారీ చెరువులో పడిపోయాడు.
ఆతన్ని రక్షించడానికి తండ్రి అయిన కృష్ణమూర్తి చెరువులోకి దిగి మునిగిపోయాడు.

Man Drowns In Pond : సెల్ఫీ దిగుతూ కాలు జారి చెరువులో పడి యువకుడు మృతి

చెరువు గట్టు మీద ఉన్న మనమడు దీపక్ తండ్రి, తాత మునిగి పోతున్న విషయాన్ని గమనించి చుట్టుపక్కల ఉన్నవారికి కేకలు వేస్తూ వారిని కాపాడేందుకు దీపక్ చెరువులో దూకాడు. ఈత రాకపోవడం గమనార్హం. ఈక్రమంలో చెరువులో పడిన ముగ్గురు కూడా మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.