మహబూబ్ నగర్ జిల్లాలో అమానుషం : ఎనిమిదేళ్ల బాలుడిని ఉరేసి చంపిన దుండగులు

మహబూబ్ నగర్ జిల్లాలో అమానుషం : ఎనిమిదేళ్ల బాలుడిని ఉరేసి చంపిన దుండగులు

Updated On : February 25, 2021 / 2:05 PM IST

Thugs killed boy : మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. మూసాపేట మండలంలోని జానంపేటలో ఎనిమిదేళ్ల బాలుడిని దుండగులు అమానుషంగా హత్య చేశారు. సతీష్ అనే ఎనిమిదేళ్ల బాలుడిని రెండు రోజుల క్రితం కిడ్నాప్ చేశారు.

అనంతరం ఉరి వేసి చంపి బాలుడి మృతదేహాన్ని బావిలో పడేశారు. తమ దాయాదులే ఈ దారుణానికి ఒడిగట్టారని బాలుడి తండ్రి విష్ణు ఆరోపిస్తున్నారు. బాలుడి మృతి కుటుంబ సభ్యులు గుండెలవిసెలా అరుస్తున్నారు.

మూడు రోజుల క్రితం బాలుడు కనిపించడం లేదని తల్లిదండ్రులు మూసాపేట్ మండల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన నేపథ్యంలో ఒక పంట పొలంలో బాలుడు సతీష్ హత్య గావించబడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

విష్ణు ఆర్టీసీ డ్రైవర్ గా పని చేస్తున్నారు. ఇదే క్రమంలో గ్రామంలో భూతగాదాలున్నాయి. దాయాదులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.