గవర్నమెంట్ స్కూళ్లలో కోడింగ్ క్లాసులు

తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(తీటా) సోమవారం నుంచి ఓ పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. ప్రయోగాత్మాకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో వనపర్తి జిల్లాలోని మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా 18ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు రోజుల పాటు కోడింగ్ క్లాసులు నిర్వహిస్తారు.
క్లాసు 8నుంచి, క్లాసు 9 నుంచి ఒక్కొక్క విద్యార్థితో పాటు ఒక టీచర్‌కు ఈ శిక్షణా తరగతులు చెబుతారు. ప్రోగ్రామింగ్, ఫైథాన్ లాంగ్వేజ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లపై శిక్షణ ఇస్తారు. తీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తలా విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పడంలో తమ వద్ద స్పెషల్ టెక్నిక్స్ ఉన్నాయని అన్నారు.
ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో అమలుచేయాలని ఐటీ మంత్రికేటీఆర్ అనుకుంటున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఇది నేర్చుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారని బాలికల్లో ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉందని అన్నారు.