Kodanda Ram : టీజేఎస్ పార్టీ విలీనం..? లేదన్న కోదండరాం

తెలంగాణ జన సమితి పార్టీ  (TJS) ఓ పార్టీలో విలీనం కానుందా ?...రెండు జాతీయ పార్టీల నుంచి ప్రతిపాదనలు కూడా వచ్చాయని.. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీలో విలీనం చేయాలని సూచనలు

Kodanda Ram : టీజేఎస్ పార్టీ విలీనం..? లేదన్న కోదండరాం

Tjs

Updated On : March 27, 2022 / 12:53 PM IST

TJS Party Secret Meeting : తెలంగాణ జన సమితి పార్టీ  (TJS) ఓ పార్టీలో విలీనం కానుందా ? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విలీనం అయితే బెటర్ అని కొంతమంది నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. రెండు జాతీయ పార్టీల నుంచి ప్రతిపాదనలు కూడా వచ్చాయని.. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీలో విలీనం చేయాలని సూచనలు వస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది పార్టీని విలీనం చేద్దామని, మరికొంతమంది ఇతర పార్టీలతో కలిసి పని చేదామని నేతలు పార్టీ అధ్యక్షులు కోదండరాంకు సూచనలు చేశారు. అయితే.. ఎన్నికల వరకు వేచి చూద్దామని వారికి కోదండరాం చెప్పినట్లు సమాచారం. కానీ ఈ విషయాలను కోదండరాం ఖండించారు. గత ఏడాది కాలంగా టీజేఎస్ (TJS) విలీనం అంటూ వార్తలు వస్తున్నాయి…కానీ తమకు అలాంటి ఆలోచన లేదని 10tvతో స్పష్టం చేశారు.

Read More : Minister KTR : రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ-ముగిసిన కేటీఆర్ అమెరికా టూర్

పార్టీని విలీనం చేస్తారని గత కొంతకాలంగా వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో… తెలంగాణ జన సమితి ముఖ్య నాయకుల రహస్య సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన జరిగిన ఆఫీస్ బేరర్స్ మేథోమధన సమావేశానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ముఖ్య నాయకుల హాజరయ్యారు. ఇబ్రహీంపట్నం దగ్గర ఓ పార్మ్ హౌజ్ లో ఈ భేటీ జరిగిందని తెలుస్తోంది. గత కొంతకాలంగా పార్టీని విలీనం చేయాలని రెండు జాతీయ పార్టీల నుండి ప్రతిపాదనలు రాగా.. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ లో విలీనం చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించడంతో పాటు అనుబంధ సంఘాల నియామకం… ప్లీనరీలో తీర్మానం చేసిన అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పోరాటాల చేయాలని కోదండరాం సూచించారు. ఇప్పటికే దాదాపు 24 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్లు, అక్కడ బలంగా పార్టీ నిర్మాణంపై దృష్టి సారించేలా చర్యలు తీసుకుంటామని కోదండరాం తెలిపారు.

Read More : Sircilla Weavers : రాజన్న సిరిసిల్లలో ఆగిపోయిన మరమగ్గాలు.. సమ్మె 7వ రోజు

దీనిపై టీజేఎస్ (TJS) అధ్యక్షులు కోదండరాం 10tvతో మాట్లాడారు. గత ఏడాది కాలంగా టీజేఎస్ విలీనం అంటూ వార్తలు వస్తున్నాయి..కానీ తమకు అలాంటి ఆలోచన లేదని కుండబద్ధలు కొట్టారు. తాము సమావేశం అయ్యింది వాస్తవమని, అది రహస్య సమావేశం కాదన్నారు. సిటీ అవుట్ కట్స్ లో సమావేశం కావాలని నిర్ణయించి నేతలంతా భేటీ అయ్యామని చెప్పుకొచ్చారు. పార్టీ భవిష్యత్ కార్యచరణ కోసమే ఈ భేటీ జరిగిందని, నేతలు కూడా విలీన ప్రతిపాదనలు చేయలేదన్నారు. ప్రస్తుతం తమ దృష్టి మొత్తం పార్టీ బలోపేతం పైనే పెట్టామన్నారు. ఇప్పటికే 24 నియోజకవర్గాలకు ఇంచార్జ్ లను నియమించడం జరిగిందని, కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎలాంటి విలీన ప్రతిపాదనలు లేవన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో విలీన ప్రతిపాదనలు కూడా లేవని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలిసొచ్చే పార్టీలతో పని చేస్తామని కోదండరాం తెలిపారు.