కొండా సురేఖ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడంతోనే ఆ ప్రస్తావన ముగిసింది: టీపీసీసీ చీఫ్ మహేశ్
మంత్రి కొండా సురేఖ వాఖ్యల మీద ఏఐసీసీ వివరణ అడగలేదని చెప్పారు.

Mahesh Kumar Goud
సినీనటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ పలు వ్యాఖ్యలు చేసి విమర్శలు రావడంతో వాటిని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ దీనిపై వివాదం ఆగడం లేదు. దీంతో ఈ విషయంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
కొండా సురేఖ ఆమె వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతోనే ఆ ప్రస్తావన ముగిసిందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, మంత్రి కొండా సురేఖ వాఖ్యల మీద ఏఐసీసీ వివరణ అడగలేదని చెప్పారు.
ఏఐసీసీ వివరణ కోరిన అంశం తన దృష్టికి మాత్రం రాలేదని స్పష్టం చేశారు. కాగా, కొండా సురేఖ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం జోక్యం చేసుకుందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నప్పటికీ దీనిపై చర్చ ఆగకపోవడం ఏంటని ఇప్పటికే తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అన్నారు.
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించాయి. ఈ వ్యవహారంపై టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది స్పందించి, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సినిమా వాళ్లని చులకనగా చూడవద్దని హెచ్చరించారు.
Punganur Girl Asiya Case: వ్యాపారి వద్ద అప్పు తీసుకుని అతడి కూతురిని చంపిన మహిళ