TPCC President Revanth Reddy: ఆ రెండు పార్టీల కుట్రలను.. జన బలంతో తిప్పికొట్టాలి
రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేలకోట్లు ఖర్చుచేసి గెలిచేందుకు కుట్రలు చేస్తున్నాయి.. వారి కుట్రలను జన బలంతో తిప్పికొట్టాలి అని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు.

TPCC President Revanth Reddy
Revanth Reddy : ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేల కోట్లు ఖర్చుపెట్టేందుకు సిద్ధం అయ్యాయి.. వారి కుట్రలను మనం జనబలంతో తిప్పికొట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం ఇందిరాభవన్‌లో టీపీసీసీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో ఎల్‌డీఎమ్.. బూత్ లెవెల్ మేనేజ్‌మెంట్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, జాతీయ నాయకులు కొప్పుల రాజు, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాత్, సంపత్ కుమార్, జాతీయ నాయకులు శశికాంత్ సింథిల్ హాజరయ్యారు. బూత్ స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమంపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిత్యం క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల కుట్రలను జనబలంతో తిప్పికొట్టాలని అన్నారు.
Revanth Reddy : నెలకు 4వేలు పెన్షన్ కచ్చితంగా ఇస్తాం, ఎలాంటి శిక్షకైనా నేను సిద్ధం- రేవంత్ రెడ్డి
ఎన్నికల్లో వచ్చిన మార్పులను, సాంకేతికతను బీజేపీ, బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయని, దీన్ని కాంగ్రెస్ అధిగమించాలని అన్నారు. గతంలో గ్రామ పెద్ద ఎటుచెప్తే అటు ఓటు వేశారు.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు రాజకీయ పార్టీలను దాటి.. ఏజెన్సీలు వచ్చాయి. ఏజెన్సీలను నియమించుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న పనిఅని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ దేశంలో అత్యంత పేద పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ ఏ రకమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుందో అర్థం చేసుకోవాలని రేవంత్ పార్టీ శ్రేణులకు కోరారు.
Revanth Reddy: తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాదా? : రేవంత్ రెడ్డి
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేలకోట్లు పెట్టేందుకు సిద్దం అయ్యాయని, బీజేపీ, బీఆర్ఎస్‌ను జన బలంతో కొట్టాలని అన్నారు. పెండింగ్‌లోఉన్న మూడు జిల్లా కమిటీలను రెండు రోజుల్లో ప్రకటిస్తామని రేవంత్ చెప్పారు. జులై 25లోగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలు పూర్తి చేస్తామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను అధికార పార్టీ తమ పార్టీకి అనుకూలంగా పనిచేయించుకుంటుందని, ఇది ఓ రకంగా అధికార దుర్వినియోగం అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ స్థాయిలోనే కాంగ్రెస్ అనుకూల, వ్యతిరేక ఓట్లను గుర్తించాలని, ఆగస్టు 18న హైదరాబాద్ మండల అధ్యక్షులకు ట్రైనింగ్ కార్యక్రమం ఉంటుందని రేవంత్ చెప్పారు.