Revanth Reddy: తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాదా? : రేవంత్ రెడ్డి

ఖమ్మంలో సభలో రాహల్ వ్యాఖ్యలపై గులాబీ నేతలు వరుస విమర్శలు సంధించారు. వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాదు మేం గుంజుకున్నం..లాక్కున్నం అని చేసిన వ్యాఖ్యలకు రేవంత్ ఘాటు రిప్లై ఇచ్చారు.

Revanth Reddy: తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాదా? : రేవంత్ రెడ్డి

Rrevanth reddy Fire On BRS Leaders

Updated On : July 3, 2023 / 6:00 PM IST

Revanth Reddy Fire On BRS Leaders : తెలంగాణ (Telangana) ఇచ్చింది కాంగ్రెస్ (congress party) కాదు మేమే గుంజుకున్నాం.. లాక్కున్నాం అంటూ బీఆర్ఎస్ నేతలు (BRS leaders)చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్రంగా మండిపడ్డారు.తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాదా? మరి ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు.  ఖమ్మంలో కాంగ్రెస్ సభను అడ్డుకోవటానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా కుట్రలు చేసిందని అయినా ప్రజలు వాటిని అధిగమించి సభను సక్సెస్ చేశారని తెలిపారు.  రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలు అర్థరహితమన్నారు. రాహుల్ కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదంటూ గులాబీ నేతలు చేసిన విమర్శలకు రాహుల్ కు తప్ప తెలంగాణ పర్యటించే అర్హత ఎవ్వరికి లేదన్నారు. రాహుల్ ను ప్రశ్నించే అర్హత బీఆర్ఎస్ కు ఉందా? అని ప్రశ్నించారు.


ఏ హోదాలో రాహుల్ గాంధీ ఈ హామీలు ఇచ్చారు : మంత్రి జగదీశ్ రెడ్డి
ఖమ్మం వేదికగా జరిగిన కాంగ్రెస్ సభలో పాల్గొని రాహుల్ గాంధీ (Rahul Gandhi)చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు (BRS leaders)మూకుమ్మడి కౌంటర్లతో విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధాప్య పెన్షన్ రూ.4000లు ఇస్తామంటూ రాహుల్ గాంధీ ప్రకటించారు. అదే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు రాహుల్ గాంధీపై విమర్శలు, సెటర్లతో హోరెత్తించారు. దీంట్లో భాగంగా మంత్రి జగదీష్ రెడ్డి (Minister Jagadish Redd)మాట్లాడుతు ‘‘ ఏ హోదాలో రాహుల్ గాంధీ ఈ హామీలు ఇచ్చారు?’’అని ప్రశ్నించారు. మరి ఇక్కడ ఇచ్చిన హామీలను మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇస్తున్నారా? ఇస్తారా? ఇవ్వగలరా? అని ప్రశ్నిస్తూ ఎద్దేవా చేశారు.

రాహుల్ రిమోట్ గాంధీగా మారిపోయారు : మంత్రి ప్రశాంత్ రెడ్డి
విలువలు లేని నాయకుడు రాహుల్ గాంధీ అంటూ మంత్రి ప్రశాంత్ రెడ్డి (Prashant Reddy)విమర్శించారు. రాహుల్ రిమోట్ గాంధీగా మారిపోయారు అంటూ ఎద్దేవా చేశారు.ఇక్కడ సన్యాసులు ఏది రాసిస్తే అది చదివేస్తారు అంటూ సెటైర్లు వేశారు. గతంలో కాంగ్రెస్ పాలనలో సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? రైతు భీమా,రైతు బంధు, కల్యాణిలక్ష్మి పథకాలు ఎందుకు ఇవ్వలేదు?కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇటువంటి పథకాలు ఉన్నాయా?  అని ప్రశ్నించారు.  ఛత్తీస్ గఢ్ లో వృద్యాప్య పెన్షన్ రూ.500, రాజస్థాన్ లో రూ.750 ఇస్తున్నారు.మరి తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.4000లు ఇచ్చేస్తామంటూ హామిలిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. జాతీయ స్థాయిలో రూ.4,000 పెన్షన్ ఇస్తామని చెప్పే దమ్ము కాంగ్రెస్ కు, రాహుల్ గాంధీకి ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో జరిగినన్ని స్కాములు ఎక్కడా జరగలేదు అంటూ విమర్శించారు.

స్కాముల పార్టీ కాంగ్రెస్ : మంత్రి పువ్వాడ
తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే వృద్ధులకు రూ.4000 పెన్షన్ ఇస్తామంటు రాహులు ప్రకటించారు. మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోను రూ.4000లు ఇవ్వాలి అని తెలియదా…? అంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు నమ్మేది కేసీఆర్ ని. కాంగ్రెస్ ను కాదన్నారు. కాంగ్రెస్ స్కాముల పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ మెచ్యురిటీ లేని నాయకుడు అంటూ ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ అంటే స్కామ్ స్కామ్ అంటే కాంగ్రెస్ అని విమర్శించారు.