వాహనదారులకు బిగ్‌అలర్ట్.. పగటిపూట ఆ 60 సెకండ్లపాటు.. డేటైమ్‌ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు.. రెండు రోజుల్లో 18 మంది..

హైదరాబాద్‌లోని వాహనదారులకు బిగ్ అలర్ట్. పగటి వేళ మద్యం సేవించి వాహనం నడుపుతున్నారా.. అయితే, మీరు జైలుకెళ్లడం ఖాయం..

వాహనదారులకు బిగ్‌అలర్ట్.. పగటిపూట ఆ 60 సెకండ్లపాటు.. డేటైమ్‌ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు.. రెండు రోజుల్లో 18 మంది..

Daytime drink and drive tests

Updated On : July 22, 2025 / 9:04 AM IST

Daytime drink and drive tests: హైదరాబాద్‌లోని వాహనదారులకు బిగ్ అలర్ట్. మద్యం సేవించి వాహనం నడుపుతున్నారా..? మధ్యాహ్నం వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఉండవ భావించి డ్రింక్ చేసి వాహనాలపై చక్కర్లు కొడుతున్నారా.. అయితే, మీరు మారాల్సిందే. హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు డే టైమ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. తప్పతాగి బండి నడిపే వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆదేశాలతో గత నాలుగు రోజుల నుంచి డే టైమ్‌లో సర్‌ఫ్రైజ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో నాలుగు వైపులా రెడ్ సిగ్నల్ పడిన సమయంలో 60 సెకండ్ల పాటు తక్కువ సిబ్బందితో తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో సుల్తాన్ బజార్ పరిధిలో శుక్రవారం 10మంది మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడగా.. శనివారం ఎనిమిది మంది పట్టుబడ్డారు.

గత నెల రోజులుగా స్కూల్స్ వద్ద చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో 35 కేసులు నమోదు కావటం ఆందోళనకు గురిచేసిందని డీసీపీ శ్రీనివాస్ చెప్పారు. స్కూల్ పిల్లలను తీసుకెళ్లే బస్సు డ్రైవర్లు మద్యం సేవించి పట్టుబడ్డారని, ఓ డ్రైవర్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో 400 పాయింట్స్ వచ్చిందని అన్నారు. దీంతో నాలుగు రోజుల నుంచి డే టైమ్ లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నట్లు చెప్పారు.

పగటిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా.. ప్రధాన కూడళ్లలో రెడ్ సిగ్నల్స్ పడినప్పుడు మాత్రమే తనిఖీలు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పూర్తిస్థాయిలో మార్పు వచ్చే వరకు పగటిపూట ఈ తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు.