Traffic Police : 15రోజులు వాహనం ఒకేచోట నిలిపి ఉంచితే సీజ్‌

వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించింది. రోజుల తరబడి రోడ్లపై వాహనాలను వదిలి వెళ్లొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Traffic Police : 15రోజులు వాహనం ఒకేచోట నిలిపి ఉంచితే సీజ్‌

Trafic Police

Updated On : March 29, 2022 / 3:32 PM IST

Traffic police warnings : హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై ఇష్టానుసారం రోడ్లపై వాహనాలను నిలిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 15రోజులపాటు ఒక వాహనాన్ని రోడ్డుపై నిలిపి ఉంచితే సీజ్ చేస్తామని ట్రాఫిక్ పోలీసు విభాగం తెలిపింది. వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించింది. రోజుల తరబడి రోడ్లపై వాహనాలను వదిలి వెళ్లొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

తాగి బండి నడపవద్దని చెబుతున్న మాటలను మందుబాబులు పెడచెవిన పెడుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఇతర ప్రాణాలను తీస్తున్నారు. పీకలదాక మద్యం సేవించి..వాహనాలను రోడ్ల మీద ఇష్టం వచ్చినట్లు నడిపిస్తున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు వీకెండ్ వేళ, హఠాత్తుగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

Hyderabad Traffic Police: బ్లాక్ స్టిక్కర్స్ పై కొరడా ఝళిపిస్తున్న ట్రాఫిక్ పోలీసులు

ఎన్ని చేస్తున్నా మందుబాబుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనేవున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ లో మందుబాబులు ర్యాష్‌ డ్రైవింగ్‌తో బీభత్సం సృష్టిస్తున్నారు. ఫుల్‌గా మద్యం సేవించి ఓవర్‌ స్పీడ్‌తో నడుపుతూ వారి ప్రాణాలతో పాటు రోడ్డుపై ప్రయాణిస్తున్న వారి ప్రాణాలను బలితీసుకుంటున్నారు.

మందుబాబుల వీరంగంతో పలువురు ప్రాణాలు కోల్పోతుండగా మరికొందరు గాయపడ్డారు. ఉదయం, పగలు, రాత్రి అనే తేడా లేదు. ఫుల్ గా మందు కొట్టి.. వాహనాలతో రోడ్ల మీదకు వస్తున్నారు. నషాలకెక్కిన కిక్కుతో ఎలా నడుపుతున్నారో వారికే అర్థం కావడం లేదు. ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన ప్రమాదంలో యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే.

Traffic Police in Rain: వర్షంలో మనుషులకే కాదు.. కుక్కలకు కూడా సాయం చేస్తున్న ట్రాఫిక్ పోలీస్

తాజాగా… జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు వద్ద కారు బీభత్సం సృష్టించింది. 2022, మార్చి 29వ తేదీ మంగళవారం ఉదయం మద్యం సేవించిన ఓ యువకుడు.. కారుతో ర్యాష్‌ డ్రైవింగ్ చేశాడు. చెక్‌పోస్టు నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు.. ముందుగా వెళుతున్న కారును, ఆటోతో పాటు రెండు బైక్ లను ఢీకొట్టాడు. కారు ఢీకొట్టిన వేగానికి ఆటో బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.