Hyderabad : ఆడుకుంటూ స్విమ్మింగ్ పూల్‌లో పడి ఐదేళ్ల బాబు మృతి.. తల్లిదండ్రులూ బీకేర్ ఫుల్
Hyderabad : పిల్లల విషయంలో మరీ ముఖ్యంగా పసి పిల్లల విషయంలో తల్లిదండ్రుల అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం.

Hyderabad
Hyderabad Puppalguda : చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. మరీ ముఖ్యంగా పసి పిల్లలు ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలను ఓ కంట కనిపెట్టుకుని ఉండాలి. వాళ్లు ఏం చేస్తున్నారు? ఏం తింటున్నారు? ఎక్కడ ఆడుకుంటున్నారు? ఏం తాగుతున్నారు? ఇలా ప్రతి విషయాన్ని గమనించాలి. తమ పనుల్లో తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నా పిల్లలను చూసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. లేదంటే ఘోరం జరిగిపోవచ్చు. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు. మీ పిల్లల ప్రాణాలే ప్రమాదంలో పడొచ్చు.
తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ ఘటన తీవ్ర విషాదం నింపింది. తల్లిదండ్రులు కాస్త ఏమరపాటుగా ఉండటం వారి బిడ్డ ప్రాణం పోవడానికి కారణమైంది. ఐదేళ్ల బాలుడు ఆడుకుంటూ స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోయాడు.
హైదరాబాద్ నార్సింగి పుప్పాల్ గూడలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్ లో పడి ఐదేళ్ల బాలుడు దేవాన్ష్ మృతి చెందాడు. స్విమ్మింగ్ పూల్ సమీపంలో ఆడుకుంటున్న దేవాన్ష్ కాలు జారి పడ్డాడు. వెంటనే దేవాన్ష్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు మరో బాలుడు. తక్షణమే స్విమ్మింగ్ పూల్ వద్దకి చేరుకున్న తల్లిదండ్రులు బాలుడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే బాలుడు అప్పటికే చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు నిర్ధారించాయి.
కన్నకొడుకు ఇక లేడు అనే వార్తను తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. గుండెలు పగిలేలా రోదించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. అదే సమయంలో పిల్లల విషయంలో మరీ ముఖ్యంగా పసి పిల్లల విషయంలో తల్లిదండ్రుల అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం.
Also Read..Boyfriend : యూపీలో బాయ్ ఫ్రెండ్ దారుణం…వివాహితను గర్భవతిని చేసి, ఆపై…
బాలుడి తల్లిదండ్రులు ఓ అపార్ట్ మెంట్ లోని థర్డ్ ఫ్లోర్ లో నివాసం ఉంటున్నారు. అదే ఫ్లోర్ లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇదే ఇప్పుడు బాలుడి ఇంట్లో విషాదం నింపింది. బాలుడు ఆడుకుంటూ స్విమ్మింగ్ పూల్ లో పడిపోయి చనిపోయాడు. తల్లిదండ్రులు నిత్యం పిల్లలను కనిపెట్టుకుని ఉండాలి. లేదంటే పిల్లల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.