Khammam: కొడుకు పెళ్లి వద్దన్నాడని.. ఖమ్మం జిల్లా పెనుబల్లిలో విషాద ఘటన

ఖమ్మం జిల్లా పెనుబల్లి బీసీ కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది.

Khammam: కొడుకు పెళ్లి వద్దన్నాడని.. ఖమ్మం జిల్లా పెనుబల్లిలో విషాద ఘటన

Tragic incident

Updated On : May 14, 2025 / 10:12 AM IST

Khammam: ఖమ్మం జిల్లా పెనుబల్లి బీసీ కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాలనీకి చెందిన తోట అంజమ్మ (45)కు ఇద్దరు కొడుకులు. భర్త అనారోగ్యంతో కొన్నేండ్ల కిందడ చనిపోయాడు. అయితే, పెద్ద కుమారుడికి ఇప్పటికే పెళ్లయింది. చిన్న కొడుకు తోట హరికృష్ణకు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు. అయితే, కొడుకు తన మాట వినడం లేదని అంజమ్మ ఆత్మహత్య చేసుకుంది.

Also Read: ‘నువ్వు చనిపోతే నేనెట్టా బతుకుతా బిడ్డా..’ కొడుకు మృతి తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య.. హృదయ విదారక ఘటన

అంజమ్మ పెళ్లి సంబంధాలు చూస్తుండగా.. చిన్నకుమారుడు హరికృష్ణ మాత్రం పెళ్లి తనకు వద్దని చెప్పాడు. దీంతో కొడుకు తన మాట వినడం లేదని తల్లి అంజమ్మ మనస్థాపం చెందింది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో టాబ్లెట్స్ మింగింది. కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అంజమ్మ కిందపడి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం పెనుబల్లి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అంజమ్మ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చనిపోయింది. వీఎం బంజర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.