Father kills 12 month old daughter : దారుణ ఘటన.. ఏడుస్తుందని చిన్నారిని నేలకేసి కొట్టిన తండ్రి.. నీకు చేతులెలా వచ్చాయిరా..

Telangana : సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కసాయి తండ్రి చేతిలో 12నెలల చిన్నారి బలైంది.

Father kills 12 month old daughter : దారుణ ఘటన.. ఏడుస్తుందని చిన్నారిని నేలకేసి కొట్టిన తండ్రి.. నీకు చేతులెలా వచ్చాయిరా..

Father kills 12 month old daughter

Updated On : September 21, 2025 / 8:07 AM IST

Father kills 12 month old daughter : సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కసాయి తండ్రి చేతిలో చిన్నారి బలైంది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే ఆ చిన్నారి పాలిట యముడిలా మారాడు. 12నెలల చిన్నారిని కాళ్లు పట్టుకొని నేలకేసి కొట్టాడు. దీంతో ఆ చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూసింది.

Also Read: Anupama Parameswaran: ఫ్రెడ్ తో గొడవ.. రెండు రోజుల్లో మరణం.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన అనుపమ

నాగారం మండలం డి.కొత్తపల్లికి చెందిన గైగుల్ల వెంకటేశ్వర్లు, నాగమణి దంపతుల కుమార్తె భవిజ్ఞ. సూర్యాపేటలోని ప్రియాంక కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో ఇంటికొచ్చిన వెంకటేశ్వర్లు భార్యతో గొడవకు దిగాడు. తల్లిదండ్రులు గొడవ పడుతుండటంతో చిన్నారి పాప హడలిపోయి ఏడ్వడం ప్రారంభించింది. మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వర్లు కన్నకూతురి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించాడు. చిన్నారి కాళ్లు పట్టుకొని నేలకేసి కొట్టాడు.

మద్యం మత్తులో ఉన్న తండ్రి నేలకేసి కొట్టడంతో చిన్నారి భవిజ్ఞకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, తలకు, ఇతర శరీర భాగాలకు బలమైన గాయాలు కావడంతో చిన్నారి చికిత్స పొందుతూనే మృతిచెందింది. చిన్నారి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారి తల్లి నాగమణి గుండెలదిరేలా రోధించింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.