కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్.. వాదనలు ఇలా జరిగాయి..

కేసు దర్యాప్తు ఏ దశలో ఉందని హైకోర్టు అడిగింది. ఇప్పటికే ఫిర్యాదుదారుడు దాన కిశోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశామని ఏజీ అన్నారు.

కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్.. వాదనలు ఇలా జరిగాయి..

KTR

Updated On : December 31, 2024 / 4:41 PM IST

మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఫార్ములాఈ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. అప్పటివరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది.

వాదనలు ఇలా జరిగాయి..
“ఎఫ్‌ఈవోతో అగ్రిమెంట్ చేసుకున్నారు.. కానీ దాని ద్వారా ఎలా లాభాలు వస్తాయో చెప్పలేదు. మూడు దఫాలుగా నగదు బదిలీ చేశారు. రూ.55 కోట్లు ఎలాంటి అనుమతులు లేకుండా ఎఫ్‌ఈవోకి బదిలీ చేశారు. ఏసీబీ దర్యాప్తు ఎక్కడ వరకు వచ్చింది. ఈ కేసులో ఎంత మంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారు” అని హైకోర్టు అడిగింది.

దీంతో ఇప్పటివరకు ఫిర్యాదుదారుడు దాన కిశోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశామని ప్రభుత్వ తరుఫు న్యాయవాది అన్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఎలాంటి ఆధారాలు సేకరించారని న్యాయస్థానం ప్రశ్నించింది. కేసు విచారణ కొనసాగుతోందని, విచారణ దశలో అన్ని ఆధారాలు బయట పడుతాయని ప్రభుత్వ తరుఫు న్యాయవాది అన్నారు.

కేసు దర్యాప్తు ఏ దశలో ఉందని హైకోర్టు అడిగింది. ఇప్పటికే ఫిర్యాదుదారుడు దాన కిశోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశామని ఏజీ అన్నారు. గవర్నర్ అనుమతి తీసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు. అరవింద్ కుమార్ బి.ఎన్.ఎల్ రెడ్డిని ఎందుకు ఈ కేసులో అరెస్టు చేయలేదని హైకోర్టు అడిగింది. కేసు విచారణ కొనసాగుతోందని త్వరలోనే చర్యలు ఉంటాయని ఏజీ అన్నారు.

సెక్షన్ 409 కేటీఆర్ కి వర్తిస్తుందని వాదనలు వినిపించారు అడ్వకేట్ జనరల్. పలు సుప్రీంకోర్టు తీర్పులను సైతం ప్రస్తావించారు. ఏసీబీకి ఫిర్యాదు చేయడానికి ఎందుకు ఆలస్యం అయిందని హైకోర్టు అడిగింది. ఇప్పుడున్న టెక్నాలజీతో డయల్ 100కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని హైకోర్టు చెప్పింది. కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి బడ్జెట్ పేపర్ మీద సిగ్నేచర్ పెట్టినట్లు ఒప్పుకున్నారని ఏజీ తెలిపారు.

ఈ ఫార్ములా కేసులో ఎలాంటి విధివిధానాలు ఫాలో అవలేదో చెప్పాలని న్యాయస్థానం అడిగింది. ఆర్థిక శాఖ, క్యాబినెట్ అనుమతులు పొందలేదని అన్నారు. అనుమతులు లేకుండానే ఎఫ్‌ఈవో సంస్థకు రూ.55 కోట్లు బదిలీ చేశారని, ఇలా నగదు బదిలీ చేయడం వల్ల రూ.8 కోట్లు హెచ్ఎండీఏకు అదనపు భారం పడిందని తెలిపారు. మునిసిపల్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు బిజినెస్ రూల్స్ ఉల్లంఘన జరిగిందని ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పారు.

కేరళను మినీ పాకిస్థాన్‌ అంటూ మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద కామెంట్స్‌.. సీఎం పినరయి విజయన్‌ ఆగ్రహం