గిరిజన మహిళా కాలేజీలో దారుణం : గర్భం దాల్చిన ముగ్గురు విద్యార్ధినులు

కొమురం భీం ఆసిఫాబాద్‌ ట్రైబల్‌ మహిళా కళాశాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. ట్రైబల్‌ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థినులు గర్భం దాల్చడం కలకలం సృష్టిస్తోంది.

  • Published By: veegamteam ,Published On : December 29, 2019 / 02:28 AM IST
గిరిజన మహిళా కాలేజీలో దారుణం : గర్భం దాల్చిన ముగ్గురు విద్యార్ధినులు

Updated On : December 29, 2019 / 2:28 AM IST

కొమురం భీం ఆసిఫాబాద్‌ ట్రైబల్‌ మహిళా కళాశాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. ట్రైబల్‌ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థినులు గర్భం దాల్చడం కలకలం సృష్టిస్తోంది.

కొమురం భీం ఆసిఫాబాద్‌ ట్రైబల్‌ మహిళా కళాశాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. ట్రైబల్‌ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థినులు గర్భం దాల్చడం కలకలం సృష్టిస్తోంది. వసతి గృహంలోని పదిమంది విద్యార్థినులకు సక్రమంగా రుతుస్రావం రాకపోవడంతో హాస్టల్‌ సిబ్బంది వారిని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. వారికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఈ సంచలన విషయాలు వెల్లడించారు. 

వారంతా గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న విద్యార్ధినిలు. ఎంతైనా హాస్టల్‌లో కదా.. అప్పుడప్పుడు ఆరోగ్యం బాగోకపోవడం జరుగుతూనే ఉంటుంది. కాని, ఒకేసారి పది మంది విద్యార్ధినులకు ఆరోగ్యం పాడైంది. కంగారు పడిన హాస్టల్‌ సిబ్బంది ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విద్యార్థినులను పరీక్షించిన వైద్యులు షాక్‌ తిన్నారు. ఆస్పత్రికి వచ్చిన పది మందిలో ముగ్గురు గర్భవతులు అని తేలింది. హాస్టల్‌లో ఉండి చదువుకునే విద్యార్థినులు ప్రెగ్నెంట్‌ అవ్వడమేంటన్నది అంతుపట్టని విషయంగా మారింది.

ప్రభుత్వం నడుపుతున్న హాస్టల్‌లో ఉంటూ.. డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్‌ గర్భం దాల్చడం చిన్న విషయమేం కాదు. విద్యార్థినులకు టెస్ట్‌లు చేసినప్పుడే.. వైద్యులు హాస్టల్‌ సిబ్బందిని ప్రశ్నించారు. అయితే, ఈ విషయం బయటికి పొక్కకుండా హాస్టల్‌ సిబ్బంది గోప్యంగా ఉంచారు. కానీ.. విషయం బయటకు రావడంతో ప్రిన్సిపల్‌ను ప్రశ్నించారు ఉన్నతాధికారులు. దీంతో జిల్లా గిరిజన శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారని సమాధానం ఇచ్చారు. 

పది మంది విద్యార్థులకు ఆరోగ్యం ఎందుకు పాడైందో కూడా కారణం తెలీదు. అయితే, హాస్టల్‌ సిబ్బంది మాత్రం.. విద్యార్థినులకు సక్రమంగా రుతుస్రావం రాకపోవడంతో అనుమానం వచ్చిందని చెబుతున్నారు. ఒక్కోసారి రుతుక్రమం తప్పడం కామనే. అలాంటిది.. హాస్టల్‌ సిబ్బంది వారినే ప్రత్యేకంగా రిమ్స్‌ ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లారనేది మిస్టరీగా మారింది. ఇక హాస్టల్‌ విద్యార్థినులు ప్రెగ్నెంట్‌ అవడం వెనక ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు కలుగుతున్నాయి. 

మొదటిసారి పది మంది విద్యార్థినులను తీసుకెళ్లినప్పుడు ముగ్గురు గర్భం దాల్చారని చెప్పారు. నెల రోజుల తర్వాత మరోసారి అదే విద్యార్థినులను టెస్ట్‌లకు తీసుకెళ్లారు. ఈసారి ఒక్కరే గర్భం దాల్చారని వైద్యులు చెప్పారు. మరి ముగ్గురికి ప్రెగ్నెన్సీ వచ్చిందన్నది నిజమా, ఒక్కరే గర్భం దాల్చారని చెప్పడం అబద్దమా అన్నది తెలియాల్సి ఉంది.

ఏది ఏమైనా హాస్టల్‌లో చదువుకుంటున్న విద్యార్థినికి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది. అసలు ట్రైబల్ వెల్ఫేర్‌ హాస్టల్స్‌లో ఏం జరుగుతోందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ ఘటనపై విచారణ జరుపుతున్న అధికారులు.. హాస్టల్‌ సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్‌సీఓ లక్ష్మయ్య విద్యార్థినుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. దాదాపు రెండు నెలలే ముందే ఈ విషయం తెలిసినా కూడా.. సమాచారం రానివ్వకపోవడంతో హాస్టల్ సిబ్బందిపై, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.