Kattela Srinivas gun : ఎమ్మెల్సీ గెలుపు సంబరాల్లో గన్ కలకలం… గాల్లోకి కాల్పులు జరిపేందుకు యత్నించిన టీఆర్ఎస్ నేత

టీఆర్ఎస్ గ్రేటర్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ తుపాకీతో హల్ చల్ చేశాడు. నిన్న తెలంగాణ భవన్ లో ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవాల్లో పాల్గొన్న శ్రీనివాస్ యాదవ్ గన్‌తో కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు.

Kattela Srinivas gun : ఎమ్మెల్సీ గెలుపు సంబరాల్లో గన్ కలకలం… గాల్లోకి కాల్పులు జరిపేందుకు యత్నించిన టీఆర్ఎస్ నేత

Trs Leader Kattela Srinivas Yadav Attempts To Shoot In Air With A Gun During Mlc Election Victory Celebrations

Updated On : March 21, 2021 / 2:39 PM IST

Kattela Srinivas Yadav attempts to shoot with gun : టీఆర్ఎస్ గ్రేటర్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ తుపాకీతో హల్ చల్ చేశాడు. నిన్న తెలంగాణ భవన్ లో ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవాల్లో పాల్గొన్న శ్రీనివాస్ యాదవ్ గన్‌తో కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. అయితే పక్కనున్న వాళ్లు వారించడంతో గన్ లోపల పెట్టేశాడు.

దీనికి సంబంధించి బంజారాహిల్స్ లో ఎలాంటి కేసు నమోదు కాలేదు. అలాగే ఎటువంటి ఫిర్యాదు అందలేదు. కానీ నిబంధనల ప్రకారం ఎవరైతే ప్రజల్లో తుపాకులు పేల్చడం, ఆయుధ యాక్టివిటీకి సంబంధించి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. అలాగే కట్టెల శ్రీనివాస్ ను ప్రశ్నించే ఛాన్స్ ఉంది.

ఇది లైసెన్స్ వెపనా? అన్ లైసెన్స్ వెపనా? వెపన్ ఎందుకు తీయాల్సి వచ్చింది? అన్ని అంశాలపై విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి స్పెషల్ బ్రాంచ్ నుంచి రిపోర్టు తీసుకొచ్చిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై కట్టెల శ్రీనివాస్ ఇప్పటివరకు స్పందించలేదు.