Group 2 Exam : గ్రూప్ 2 పరీక్ష రాసే అభ్యర్థులకు బిగ్ రిలీఫ్.. కొత్త తేదీలు ప్రకటించిన టీఎస్ పీఎస్సీ

గ్రూప్ 2 పరీక్షకు వారం రోజుల ముందు నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. Group 2 Exam - TSPSC

Group 2 Exam : గ్రూప్ 2 పరీక్ష రాసే అభ్యర్థులకు బిగ్ రిలీఫ్.. కొత్త తేదీలు ప్రకటించిన టీఎస్ పీఎస్సీ

Group 2 Exam - TSPSC (Photo : Google)

Group 2 Exam – TSPSC : గ్రూప్ 2 పరీక్ష రాసే అభ్యర్థులకు బిగ్ రిలీఫ్. గ్రూప్ 2 పరీక్షను రీషెడ్యూల్ చేసింది టీఎస్ పీఎస్సీ. గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు కొత్త తేదీలు అనౌన్స్ చేసింది. నవంబర్ 2, 3 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. ఉదయం 10 నుంచి 12.30 గంటలవరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామంది.

గ్రూప్ 2 పరీక్షకు వారం రోజుల ముందు నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29, 30న గ్రూప్ 2 పరీక్ష జరగాల్సి ఉంది. అయితే, అభ్యర్థుల డిమాండ్ తో పరీక్షను వాయిదా వేసింది టీఎస్ పీఎస్ సీ.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 పరీక్షలను ప్రభుత్వం నవంబర్ కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రీషెడ్యూల్‌ చేసిన తేదీలను టీఎస్‌పీఎస్సీ ఆదివారం(ఆగస్టు 13) సాయంత్రం విడుదల చేసింది. నవంబర్‌ 2, 3 తేదీల్లో గ్రూప్‌ 2 పరీక్షలు నిర్వహించనున్నట్టు TSPSC వెల్లడించింది. తెలంగాణలో మొత్తం 783 గ్రూప్‌ 2 ఉద్యోగాలకు 5లక్షల 51వేల 943 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడనున్నారు.

Also Read..Government Jobs : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. నెలకు లక్ష రూపాయల జీతంతో ప్రభుత్వ ఉద్యోగం.. అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ వివరాలు

తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌ 2 పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, ఆగస్టు నెలలో పలు పరీక్షలు ఉన్నాయి. గురుకుల టీచర్‌ పరీక్షలు, స్టాఫ్‌నర్స్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్స్‌, పాలిటెక్నిక్‌, జూనియర్‌ లెక్చరర్‌, ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్‌ వంటి పలు పోటీ పరీక్షలు ఉన్నాయి.

ఈ క్రమంలో గ్రూప్‌ 2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. ఒకే నెలలో అన్ని పరీక్షలు ఉండటం వల్ల అన్నింటికీ హాజరుకాలేమని, ప్రిపరేషన్ కు సమయం సరిపోదని అభ్యర్థులు వాపోయారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా కోరుతూ 150 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, కార్యదర్శితో సమావేశం అయ్యారు. అన్ని అంశాలపై చర్చించారు. అనంతరం సీఎంకు నివేదించారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకు పరీక్షలను నవంబర్ కు వాయిదా వేసిం ప్రభుత్వం. తాజాగా కొత్త తేదీలను ప్రకటించింది టీఎస్ పీఎస్ సీ.

లక్షలాది మంది అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా గ్రూప్-2 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అలాగే, భవిష్యత్తులో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లు సరిగ్గా ఉండేలా చూడాలని, పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు తగినంత సమయం ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.

గురుకుల, గ్రూప్ 2, జేఎల్‌, ఏఓ పాలిటెక్నిక్ లెక్చరర్స్ పరీక్షల మధ్య తగినంత వ్యవధి లేకపోవడం వల్ల గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. ఇప్పటికే ఈ నెల 3 నుంచి 22 వరకు గురుకుల, జేఎల్, డీఎల్ పరీక్షలు జరుగుతున్నాయని.. వచ్చే నెలలో టెట్ పరీక్ష ఉందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో TSPSC గ్రూప్ 2 పరీక్షకు ప్రిపేర్ అవడానికి సమయం లేదని వాపోయారు. ఈ నెల 29, 30న జరిగే గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

Also Read..AIIMS Mangalagiri : ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో ఉద్యోగ ఖాళీల భర్తీ

గురుకుల, ఇతర పరీక్షలు ఉన్నందున గ్రూప్ ఎగ్జామ్ వాయిదా వేయాలని పిటిషన్‌లో కోరారు. గ్రూప్‌-2 రీ షెడ్యూల్‌ చేయాలంటూ 150 మంది గ్రూప్‌-2 అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. గ్రూప్ ఎగ్జామ్ ఎందుకు వాయిదా వేయకూడని టీఎస్ పీఎస్ సీని ప్రశ్నించింది. వాయిదా వేస్తే ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అవకాశం లభిస్తుంది కదా అని వ్యాఖ్యానించింది. పరీక్ష నిర్వహణపై సోమవారం(ఆగస్టు 14) తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని టీఎస్ పీఎస్ సీ కోర్టుకి తెలిపింది. ఇంతలోనే పరిణామాలు వేగంగా మారిపోయాయి.