AIIMS Mangalagiri : ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో ఉద్యోగ ఖాళీల భర్తీ

అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్ధుల ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభంకాగా నోటిఫికేషన్ వెలువడిన నాటి నుండి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

AIIMS Mangalagiri : ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో ఉద్యోగ ఖాళీల భర్తీ

AIIMS Mangalagiri

AIIMS Mangalagiri : ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్‌) మంగళగిరిలో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన నాన్ ఫ్యాకల్టీ గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 70 పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి ,అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Menopause : మెనోపాజ్ దశలో మహిళల్లో వచ్చే ముఖ్యమైన మార్పులు ఇవే ?

భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించి గ్రూప్-బి పోస్టులకు సంబంధించి సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్ గ్రేడ్-1) 58, పీఏ టు ప్రిన్సిపాల్1, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్1, మెడికల్ సోషల్ వర్కర్1, అసిస్టెంట్(ఎన్‌ఎస్‌)1, పర్సనల్ అసిస్టెంట్1, లైబ్రేరియన్ 3గ్రేడ్ 1 పోస్టులు ఉన్నాయి. గ్రూప్-సి పోస్టులకు సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్2 , అప్పర్ డివిజనల్ క్లర్క్2 , ల్యాబ్ అటెండెంట్ 2 పోస్టులు ఉన్నాయి.

READ ALSO : Hyderabad: రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో ఇళ్లకు భారీ డిమాండ్.. ఎందుకో తెలుసా!

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో ఇంటర్, డీఎంఎల్‌టీ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టుని అనుసరించి 18-35 సంవత్సరాలు ఉండాలి. దరఖాస్తు ఫీజుగా 1000రూ నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకురూ.100. చెల్లించాల్సి ఉంటుంది.

READ ALSO : Headache : తలనొప్పి ఎందుకు వస్తుంది? దానిని నివారణకు చిట్కాలు

అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్ధుల ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభంకాగా నోటిఫికేషన్ వెలువడిన నాటి నుండి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.aiimsmangalagiri.edu.in/ పరిశీలించగలరు.