RTC : ఆర్టీసీ గుడ్‌న్యూస్, టికెట్ ధరలపై 50 శాతం డిస్కౌంట్ ..
ప్రయాణీకులకు ఆర్టీసి అద్దిరిపోయే శుభవార్త చెప్పింది. టికెట్ ధరపై ఏకంగా 50శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీనికి సంబందించిన మరిన్ని వివరాల కోసం కొన్ని ఫోన్ నంబర్లను వెల్లడించింది.

TSRTC special discounts Independence Day
TSRTC special discounts : తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. టికెట్ ధరలపై50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. సిటీ బస్సులతో పాటు పల్లె వెలుగు బస్సుల్లో కూడా స్వాతంత్ర్య దినోత్సం సందర్భంగా ఈ రాయితీలు అమలు కానున్నాయి.కాపోతే ప్రయాణీకులు గమనించాల్సిన విషయం ఏమిటంటే..
ఈ రాయితీ ఆగస్టు 15వ తేదీన మాత్రమే అమల్లో ఉంటాయి. పల్లె వెలుగు బస్సుల్లో 60 ఏళ్ళు దారిన స్త్రీ, పురుషులకు (సీనియర్ సిటిజన్స్) 50% రాయితీ అమలు కానుంది. అలా రాయితీ పొందాలంటే వయసు ధ్రువీకరణకు ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ తగ్గింపు అందుబాటులో ఉంటుందని TSRTC ఒక పత్రికా ప్రకటనలో ప్రయాణికులకు తెలియజేసింది.
అలాగే హైదరాబాదులో 24 గంటల అపరిమిత ప్రయాణానికి సంబంధించి టి-24 టికెట్ ను రూ.75కే ఇవ్వనున్నామని వెల్లడించింది. అలాగే పిల్లలకు టీ-24 టికెట్ ధర 50గా నిర్ణయించింది. రాయితీలను ఉపయోగించుకునే స్వాతంత్ర దినోత్సవాల్లో పాల్గొనాలని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి వీసీ సజ్జనార్ (MD VC Sajjanar) ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలకు ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-694400, 040-23450033 లను సంప్రదించాలని సూచించారు.