TSRTC Charges : ఓ ట్విటర్‌ పోస్టు.. ఆర్టీసీ చార్జీలు తగ్గించింది

ఓ ట్విటర్‌ పోస్టు టీఎస్ఆర్టీసీ చార్జీలు తగ్గించడానికి కారణమైంది. గతంలో రౌండ్‌ ఆఫ్‌ పేరిట పెంచిన అదనపు వసూళ్లను తగ్గించుకుంది.

TSRTC Charges : ఓ ట్విటర్‌ పోస్టు.. ఆర్టీసీ చార్జీలు తగ్గించింది

Tsrtc

Updated On : November 11, 2021 / 5:14 PM IST

passenger’s Twitter post : ఓ ట్విటర్‌ పోస్టు టీఎస్ఆర్టీసీ చార్జీలు తగ్గించడానికి కారణమైంది. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ నష్టాల్లో ఉంది. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కరోనా సమస్యతో అతలాకుతలమవుతోంది. ఇలాంటి పరిస్థితిలో ప్రతి రూపాయి ఆర్టీసీకి కీలకమే. కానీ ఓ ప్రయాణికుడు ట్విట్టర్‌లో పెట్టిన పోస్టుకు స్పందించిన ఆర్టీసీ.. రోజూ లక్షల్లో ఆదాయాన్ని కోల్పోయేందుకు సిద్ధమైంది. గతంలో రౌండ్‌ ఆఫ్‌ పేరిట పెంచిన అదనపు వసూళ్లను తగ్గించుకుంది. ప్రస్తుతం నష్టం వచ్చినా.. సంస్థ ప్రతిష్ట మెరుగుపడి భవిష్యత్తులో ప్రయాణికులు ఆర్టీసీ వైపు మొగ్గుచూపుతారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.

ఇటీవల ఓ ప్రయాణికుడు బెంగుళూరు బస్సు ఎక్కాడు. టికెట్‌పై వివరాలు చూసి కంగుతిన్నాడు. టికెట్‌ అసలు ధర రూ.841 అని.. కానీ చెల్లించాల్సిన మొత్తం రూ.850 అని ఉండటంతో కండక్టర్‌ను నిలదీశారు. అసలు ధరను మించి రూ.9 వసూలు చేయడం ఏమిటని, ఆ మొత్తం ఎటు పోతోందని ప్రశ్నిస్తూ ట్విటర్‌లో పోస్టు పెట్టారు. ఇది ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వరకు వెళ్లింది.

Judicial Remand : యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడికి 14 రోజుల రిమాండ్

కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆయన దీనిపై స్పష్టత లేక.. అధికారులను వాకబు చేశారు. టికెట్‌ ధరలు సవరించినప్పుడు చిల్లర సమస్య రాకుండా రౌండ్‌ ఆఫ్‌ చేసే విధానం ఉందని, దాని ప్రకారమే ఆ రూ.9 వసూలు చేశామని తెలిపారు. ఇలా అదనంగా వసూలు చేయటం వల్ల ఆర్టీసీ ప్రతిష్ట తగ్గుతుందని భావించిన ఆయన.. వెంటనే ఈ రేట్లను సవరించాలని అధికారులను ఆదేశించారు.

ఆ మేరకు అధికారులు.. ఎక్స్‌ప్రెస్, ఆపై కేటగిరీ బస్సుల్లో రౌండ్‌ ఆఫ్‌ సొమ్మును సవరించారు. దీని ప్రకారం.. గతంలో రూ.841 నుంచి రూ.850కి పెంచిన బెంగుళూరు టికెట్‌ ధరను.. ఇప్పుడు రూ.840కి తగ్గించారు. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కనీస చార్జీ రూ.15, దీనికి సెస్‌ రూపాయి కలిపితే రూ.16 అవుతుంది.

Solar Plant : ఢిల్లీలోని టీటీడీ శ్రీవెంకటేశ్వర కాలేజీలో సోలార్ ప్లాంట్ ప్రారంభం

దీనిని చిల్లర ఇబ్బంది పేరిట రూ.20గా రౌండ్‌ ఆఫ్‌ చేసి, వసూలు చేస్తూ వచ్చా రు. తాజాగా దీనిని రూ.15కు తగ్గించారు. ఇలా అన్నిస్థాయిల్లో మార్చారు. దీనివల్ల రోజూ సగటున రూ.10 లక్షల వరకు టికెట్‌ ఆదాయం తగ్గిపోవడానికి కారణమైనట్టు అధికారులు చెప్తున్నారు.