TSRTC : పుస్తక ప్రియులకు TSRTC శుభవార్త
హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న 34వ జాతీయ పుస్తక ప్రధర్శనకు వచ్చే పుస్తక ప్రియులకు టీఎస్ఆర్టీసి డిస్కౌంట్ ప్రకటించింది.

Book Fair Tsrtc
TSRTC : హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న 34వ జాతీయ పుస్తక ప్రధర్శనకు వచ్చే పుస్తక ప్రియులకు టీఎస్ఆర్టీసి డిస్కౌంట్ ప్రకటించింది. డిసెంబర్ 18 నుంచి 27 వరకు పుస్తక ప్రదర్శన జరుగుతుంది. ఈ పుస్తక ప్రదర్శనకు వచ్చే పుస్తక ప్రియులు ఆర్టీసీ బస్సుల్లో T24 టిక్కెట్‌లు కొనుగోలు చేస్తే వాటిపై 20 శాతం తగ్గింపును అందిస్తోంది.
T24 టిక్కెట్టు టికెట్ కొనుగోలు నుండి 24 గంటల పాటు సిటీ సర్వీస్‌లలో (డీలక్స్ బస్సుల వరకు) ఎన్నిసార్లైనా ప్రయాణించడానికి నగర ప్రయాణీకులను సులభతరం చేస్తుంది. వాస్తవానికి దీని ధర రూ. 100, అయితే బుక్ ఫెయిర్‌ను సందర్శించే ప్రయాణీకులకు TSRTC కేవలం 80 రూపాయలకే బహుమతిగా అందజేస్తోంది.
Also Read : AP Covid Update : ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిన కోవిడ్ కేసులు