TSRTC: వేసవి కోసం ప్రయాణికులకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోన్న ఆర్టీసీ

మార్చి నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయని, రద్దీకి అనుగుణంగా బస్సులను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. అద్దె బస్సులపై 10 శాతం రాయితీ కల్పిస్తోన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు. ముందస్తు రిజర్వేషన్‌కు రాయితీ కల్పిస్తున్నామన్నారు

TSRTC: వేసవి కోసం ప్రయాణికులకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోన్న ఆర్టీసీ

TSRTC is making arrangements for passengers for summer

Updated On : February 24, 2023 / 3:07 PM IST

TSRTC: వేసవిలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్ దిశానిర్దేశం చేశారు. బస్టాండ్‌ల్లో తాగునీరు సదుపాయంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆయన ఆదేశించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఫ్యాన్లు, కూలర్లు, బెంచిలను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. వేసవిలో ప్రయాణికులకు ఏర్పాట్లు, సంస్థలోని ఇతర అంశాలపై హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌ నుంచి ఆర్‌ఎంలు, డీఎంలు, ఉన్నతాధికారులతో సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ గారు ఆన్‌లైన్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

Medico Preeti Case: ర్యాగింగ్ కాదు, ఆ కారణం వల్లే ఆత్మహత్యాయత్నం.. వైద్య విద్యార్థి ప్రీతి కేసుపై వరంగల్ సీపీ కీలక విషయాలు

ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని నిర్ధేశించారు. ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రాబోయే కాలం టీఎస్‌ఆర్టీసీకి ఎంతో కీలకమని, ఆ మేరకు అధికారులందరూ పూర్తిగా సన్నద్ధం కావాలన్నారు. సంస్థ ఆర్థిక పుష్టికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించడమే తమ ప్రధాన విధి అనే విషయం మరిచిపోవద్దని చెప్పారు.

GHMC: 36 గంటల్లో 15,000.. కుక్కల బెడదపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదుల వెల్లువ

మార్చి నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయని, రద్దీకి అనుగుణంగా బస్సులను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. అద్దె బస్సులపై 10 శాతం రాయితీ కల్పిస్తోన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు. ముందస్తు రిజర్వేషన్‌కు రాయితీ కల్పిస్తున్నామన్నారు. 31-45 రోజుల ముందు రిజర్వేషన్‌ చేసుకుంటే 5 శాతం రాయితీ, 46-60 రోజుల ముందు టికెట్‌ బుక్‌ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు వివరించారు. ఈ ప్రత్యేక రాయితీలను సద్వినియోగం చేసుకుని సంస్థను ఆదరించాలని ప్రజలను కోరారు.