RTC MD Sajjanar: వాహ్.సజ్జనార్ సర్, 12ఏళ్ల తర్వాత గ్రామానికి బస్సొచ్చింది….
ఆ గ్రామానికి బస్ సర్వీసు ఆపేసి 12ఏళ్లు దాటేసింది. రోడ్ బాగాలేదని, ప్రయాణికుల రద్దీ ఉండటం లేదని సర్వీస్ నిలిపేశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ వచ్చిన తర్వాత

Sajjanar
RTC MD Sajjanar: ఆ గ్రామానికి బస్ సర్వీసు ఆపేసి 12ఏళ్లు దాటేసింది. రోడ్ బాగాలేదని, ప్రయాణికుల రద్దీ ఉండటం లేదని సర్వీస్ నిలిపేశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ వచ్చిన తర్వాత ఆ ఊరికి ఆర్టీసీ సదుపాయం దక్కింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి కొత్తగూడెం డిపోకు చెందిన బస్సు సర్వీసు శుక్రవారం నుంచి మొదలైంది.
గ్రామానికి చెందిన చెవుల బాలరాజు అనే వ్యక్తి నవంబర్ 7న ట్విట్టర్‌లో టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్వీట్ చేశారు. రూట్ మ్యాప్ పరిశీలించి గ్రామానికి బస్సు నడపాలని కొత్తగూడెం డిపో మేనేజర్ వెంకటేశ్వరబాబుకు ట్విట్టర్ ద్వారానే సూచించారు.
దీనిపై ప్లానింగ్ చేసిన 11న సీనియర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మాంచా నాయక్, కంట్రోలర్ జాకంతో కలిసి కొత్తగూడెం డిపో మేనేజర్ గ్రామానికి చేరుకుని చర్చలు జరిపారు. సాధ్యాసాధ్యాలపై సమీక్షించి అనంతరం సర్వీసు ప్రారంభించాలని ఫిక్స్ అయ్యారు. 12ఏళ్ల తర్వాత తమ గ్రామానికి బస్సు రావడంతో సంబరాలు చేసుకున్న గ్రామస్తులు బస్సుకు మామిడి తోరణాలు, కొబ్బరి ఆకులు కట్టి స్వీట్లు పంచుకున్నారు.
…………………………………….: స్థిరంగా బంగారం.. భారీగా తగ్గిన వెండి ధర
ఈ విషయాన్ని వివరిస్తూ గ్రామంలో డప్పు చాటింపు కూడా వేయించి అందరికీ తెలియజేశారు.
మన కాకర్లకు బస్సు వస్తుంది .మనము బస్సులోనే ప్రయానిద్ధాం@tsrtcmdoffice pic.twitter.com/lN3610PrIg
— RM tsrtc khammam region (@KhammamRm) November 19, 2021