Bharat Summit: హెచ్ఐసీసీలో రెండ్రోజులు భారత్ సమ్మిట్.. వందకుపైగా దేశాల నుంచి ప్రతినిధులు..
హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో ఇవాళ్టి నుంచి రెండ్రోజులు పాటు భారత్ సమ్మిట్ జరగనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సమృద్ధి భారత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ కు..

Bharat Summit
Bharat Summit: హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో ఇవాళ్టి నుంచి రెండ్రోజులు పాటు భారత్ సమ్మిట్ జరగనుంది. భారత తొలి ప్రధాన మంత్రి నెహ్రూ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సమృద్ధి భారత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ కు వందకుపైగా దేశాల నుంచి 450 మందికిపైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఉదయం 10.30గంటలకు సమ్మిట్ ప్రారంభమవుతుంది. కశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి సభ సంతాపం తెలపనుంది.
Also Read: Telangana 10th Results: తెలంగాణలో టెన్త్ విద్యార్థులకు అలర్ట్ .. ఫలితాలు వచ్చేది ఆరోజే!
‘‘అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి కాంగ్రెస్ పార్టీ మూల సూత్రాలపై దృష్టిసారించి, నెహ్రూ నాన్ – అలైన్‌మెంట్ ఉద్యమ స్ఫూర్తిని ఆధారంగా తీసుకొని ఈ సమ్మిట్ ప్రపంచ సమస్యలపై చర్చకు వేదికగా నిలవనుంది. రాహుల్ గాంధీ ఆలోచనల ప్రకారం, ప్రపంచానికి భారత్ నేతృత్వాన్ని ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమం రూపుదిద్దుకుందని’’ నేతలు తెలిపారు. సమ్మిట్ మొదటి రోజు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు స్వాగతోపన్యాసాలు చేస్తారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలపై ఈ సమ్మిట్ లో చర్చజరగనుంది.
సాయంత్రం సెషన్ కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విదేశీ ప్రతినిధులకు తెలంగాణ వంటకాలను ప్రభుత్వం పరిచయం చేయనుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. సమ్మిట్ తో హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
భారత్ సమ్మిట్ కి విచ్చేసిన విదేశీ ప్రతినిధులకు ఆహ్వానం పలికిన టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు. pic.twitter.com/QZCArDTGwJ
— Telangana Congress (@INCTelangana) April 24, 2025
ఈ ప్రతిష్ఠాత్మకమైన భారత్ సమ్మిట్ ఏర్పాట్లను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి , మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ వంటి ప్రముఖ నాయకులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సమ్మిట్‌కు విచ్చేసిన వివిధ దేశాల ప్రతినిధులకు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు సాదరంగా ఆహ్వానం పలికారు.
నెహ్రూ స్ఫూర్తితో
“భారత్ సమ్మిట్ 2025”తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ ఒక విశేషమైన అంతర్జాతీయ కార్యక్రమం.
ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల నుండి 450 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు.
అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి కాంగ్రెస్… pic.twitter.com/e9Z8vdEhhy
— Telangana Congress (@INCTelangana) April 24, 2025