Two New Mandals : తెలంగాణలో మరో రెండు కొత్త మండలాలు

మాడ్గుల మండలం నుంచి తొమ్మిది గ్రామాలు ఇర్విన్, బ్రాహ్మణపల్లి, అర్కపల్లి, అండుగుల, అన్నెబోయినపల్లి, సుద్దపల్లి, గిరికొత్తపల్లి, కలకొండ, రమణపల్లిని వేరు చేస్తూ కొత్త మండలం ఏర్పాటు చేసింది.

Two New Mandals : తెలంగాణలో మరో రెండు కొత్త మండలాలు

Telangana new mandals

Updated On : June 29, 2023 / 9:09 AM IST

Telangana Two New Mandals Formed : బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జిల్లాలు, మండలాల సంఖ్యను పెంచిన విషయం తెలిసిందే. కొత్తగా జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో తాజాగా మరో రెండు కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలోని కొత్తగా ఇర్విన్ మండలాన్ని ఏర్పాటు చేసింది. మాడ్గుల మండలం నుంచి తొమ్మిది గ్రామాలు ఇర్విన్, బ్రాహ్మణపల్లి, అర్కపల్లి, అండుగుల, అన్నెబోయినపల్లి, సుద్దపల్లి, గిరికొత్తపల్లి, కలకొండ, రమణపల్లిని వేరు చేస్తూ కొత్త మండలం ఏర్పాటు చేసింది.

Chandrababu : అమ్మఒడిపై నువ్వు చెప్పేవన్నీ పచ్చి అబద్దాలే కదా జగన్ రెడ్డీ : చంద్రబాబు కౌంటర్ ట్వీట్

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ భూపాలపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో కొత్తపల్లిగోరి మండలాన్ని ఏర్పాటూ చేస్తూ ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేసింది. రేగొండ మండలంలోని ఏడు గ్రామాలు కొత్తపల్లిగోరి, చెన్నాపూర్, చిన్నకోడెపాక, జగ్గయ్యపేట, సుల్తాన్ పూర్, జంషెడ్ బేగ్ పేట, కొనారావు పేటను వేరు చేస్తూ కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారు. ఈ రెండు కొత్త మండలాల ఏర్పాటుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియేజేయాలని కోరింది.