Kodada Rape Incident : కోదాడలో దారుణం.. కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి 3 రోజులుగా అత్యాచారం

కోదాడలో దారుణం జరిగింది. మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి.. యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.(Kodada Rape Incident)

Kodada Rape Incident : కోదాడలో దారుణం.. కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి 3 రోజులుగా అత్యాచారం

Kodada Rape

Updated On : April 18, 2022 / 6:31 PM IST

Kodada Rape Incident : నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. మహిళకు రక్షణ దొరకడం లేదు. దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోట స్త్రీలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు అత్యాచారాలకు తెగబడుతున్నారు. నమ్మించి కొందరు, పరిచయం పేరుతో మరికొందరు, ప్రేమ పేరుతో ఇంకొందరు.. దురాఘతాలకు పాల్పడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడలో దారుణం జరిగింది. యువతిపై మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి యువతిపై అఘాయిత్యం చేశారు.(Kodada Rape Incident)

Village Volunteer: తూర్పుగోదావరి జిల్లాలో బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం

యువతిపై ఇద్దరు యువకులు మూడు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. మూడు రోజుల తర్వాత యువతి బంధువులకు సమాచారం తెలిసింది. తీవ్ర గాయాల పాలైన యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై కోదాడ పట్టణ పోలీసులకు బాధితురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు కౌన్సిలర్ కుమారుడిగా పోలీసులు గుర్తించారు.

Honour Killing : మాజీ హోంగార్డు రామకృష్ణ హత్యకేసులో సంచలన విషయాలు..?

బాధిత యువతి పూల వ్యాపారం చేస్తుంది. మూడు రోజుల క్రితం ఇద్దరు యువకులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లారు. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఆమెతో తాగించారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశారు. ఇలా మూడు రోజుల పాటు ఆ యువకులు యువతికి నరకం చూపించారు. మూడు రోజుల తర్వాత యువతి ఇంటికి వచ్చింది.(Kodada Rape Incident)

ఆమె ఒంటిపై ఉన్న గాయాలు చూసి కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఏం జరిగింది అని అడగ్గా యువతి విషయం చెప్పింది. దీంతో వారు షాక్ కి గురైంది. వెంటనే యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించారు. కౌన్సిలర్ కుమారుడు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేసు నమోదు చేయకుండానే ఈ ఇష్యూని సెటిల్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి యువతిపై ఇద్దరు యువకులు మూడు రోజుల పాటు అత్యాచారం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు ఎలాంటి ఒతిళ్లకు తలొగ్గకుండా విచారణ జరిపి నిందితులకు కఠినంగా శిక్షపడేలా చూడాలని స్థానికులు, బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మహిళలపై అఘాయిత్యాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడపిల్ల తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులు ఆందోళన పడే పరిస్థితులు నెలకొన్నాయి.