Honour Killing : మాజీ హోంగార్డు రామకృష్ణ హత్యకేసులో సంచలన విషయాలు..?
మాజీ హోం గార్డు, రియల్టర్ రామకృష్ణ హత్యకేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో మరో హోం గార్డు యాదగిరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు.

Ex Home Guard Ramakrishna Murder Case
Honour Killing : మాజీ హోం గార్డు, రియల్టర్ రామకృష్ణ హత్యకేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో మరో హోం గార్డు యాదగిరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. నిందితుడు, రామకృష్ణ మామ, వీఆర్వో వెంకటేష్‌కు లతీఫ్ గ్యాంగ్‌ను పరిచయం చేసింది బీబీనగర్ లో పని చేసే హోం గార్డు యాదగిరిగా పోలీసులు గుర్తించారు.
ఆర్ధికంగా బలంగా లేడని…తనతో తిరుగుతూనే తన కూతురుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపంతోనే వెంకటేష్ లతీఫ్‌కు రూ.10 లక్షలు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు నిందితులు ఒప్పుకున్నారు.
ఈ కేసులో ఇంతవరకు ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణను కల్లుగీత కత్తి, గొడ్డలితో నరికి హత్యచేసింది లతీఫ్ గ్యాంగ్. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని సిద్దిపేట్ సమీపంలోని లకుడారం వద్ద పాతిపెట్టినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఈరోజు సాయంత్రం నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Also Read : Tirumala : తిరుమలలో బ్రేక్ దర్శనాలు పునరుధ్ధరణ