తెలంగాణలో అమిత్ షా పర్యటన.. ఏఏ కార్యక్రమాల్లో పాల్గొంటారంటే? పూర్తి షెడ్యూల్ ఇదే..
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.20 గంటల నుంచిసాయంత్రం 6గంటల వరకు పలు కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటారు.

Minister Amit Shah
Amit Shah Telangana Tour : పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే తొమ్మిది పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం.. మరో ఎనిమిది స్థానాల్లో రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. అత్యధిక స్థానాల్లో బీజేపీ జెండాను ఎగువేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ఆ పార్టీ నేతలు ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో అగ్రనేతలు ప్రచార సభల్లో పాల్గొంటూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ఇటీవల తెలంగాణలో రెండు రోజులు ప్రధాని మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు.
Also Read : CAA : మోదీ సర్కారు సంచలన నిర్ణయం.. సీఏఏ అమలుకు నోటిఫికేషన్ జారీ
మరో నెలరోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా సీఏఏపై చర్చ జరుగుతుంది. ఈ సమయంలో తెలంగాణలో కేంద్ర మంత్రి పర్యటన కొనసాగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.20 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారు. సాయంత్రం 6గంటల వరకు తెలంగాణలోని పలు పార్టీ కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటారు.
Also Read : Mallu Ravi Comments : భట్టి విక్రమార్కకు అవమానం అంటూ బీఆర్ఎస్ మొసలి కన్నీరు : మల్లు రవి కామెంట్స్
- అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఇలా..
మధ్యాహ్నం 1.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి కేంద్ర మంత్రి అమిత్ షా చేరుకుంటారు.
మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 2.45 వరకు ఇంపీరియల్ గార్డెన్ లో బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ లో పాల్గొంటారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు.
3.15 గంటల నుంచి సాయంత్రం 4.25 గంటల వరకు ఎల్బీ స్టేడియంలో నిర్వహించే విజయ సంకల్ప సమ్మేళనంలో అమిత్ షా పాల్గొంటారు.
బీజేపీ పోలింగ్ బూత్ కమిటీల అధ్యక్షులు, ఆ పై మండల, జిల్లా కమిటీ అధ్యక్షులు, నాయకులు, పార్టీ కార్యకర్తలకు ఆయన మార్గనిర్దేశనం చేస్తారు.
సాయంత్రం 4.45 గంటల నుంచి 5.45 గంటల వరకు ఐటీసీ కాకతీయ హోటల్ లో పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం అవుతారు.
సాయంత్రం 6.10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం అవుతారు.