Kishan Reddy : సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్ వేర్వేరుగా లేఖలు

కేంద్రం... తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నిధులను లెక్కలతో సహా లేఖలో పేర్కొన్నారు. ఏడేళ్లలో రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం 9రెట్లు ఎక్కువ నిధులు కేటాయించామని తెలిపారు.

Kishan Reddy : సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్ వేర్వేరుగా లేఖలు

Kishan Reddy Letter

Updated On : January 25, 2022 / 7:27 AM IST

Kishan Reddy and Rajasingh letters to CM KCR : సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. రైల్వే ప్రాజెక్టు ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా.. రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్న టీఆర్ఎస్ నేతల ఆరోపణలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రం… తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నిధులను లెక్కలతో సహా లేఖలో పేర్కొన్నారు. ఏడేళ్లలో రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం 9రెట్లు ఎక్కువ నిధులు కేటాయించామని.. ఇప్పటికే కేటాయించిన ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా నిధులు, భూ కేటాయింపులు త్వరితగతిన ఇవ్వాలని కిషన్‌ రెడ్డి అన్నారు.

CM KCR : ఐఏఎస్‌ సర్వీస్‌ రూల్స్‌ మార్చొద్దు.. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా లేఖ రాశారు. తన నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు నెల రోజుల్లో అనేకసార్లు అపాయింట్‌మెంట్‌ కోరినట్టు తెలిపారు. అయినా ముఖ్యమంత్రి సమయం ఇవ్వలేదని రాజాసింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

అసెంబ్లీ సాక్షిగా ఎప్పుడైనా కలవొచ్చని సీఎం చెప్పారని.. ఇప్పుడేమో సమయమే ఇవ్వడం లేదన్నారు. అదే ఎంఐఎం ఎమ్మెల్యేలకు మాత్రం… అపాయింట్‌మెంట్ ఇస్తున్నారని రాజాసింగ్‌ ఆరోపించారు.