Uttam Kumar Reddy: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్

అడ్డగోలుగా అంచనాలు పెంచారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Uttam Kumar Reddy: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్

Uttam Kumar Reddy

Updated On : February 14, 2024 / 5:04 PM IST

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల విషయంలో సలహా అడుగుతామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అన్ని విషయాల్లో మాజీ సీఎం కేసీఆర్ అనుభవజ్ఞుడనుకుంటారని, అయనలాగా తాము కాదని చెప్పారు. అందుకే తాము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సలహా అడుగుతున్నామని తెలిపారు.

మేడిగడ్డ ఘటనపై కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అడ్డగోలుగా అంచనాలు పెంచారని, నిర్మాణాలకు వందల కోట్ల రూపాయలు పెంచారని తెలిపారు. తక్కువ వ్యవధి, అత్యధిక వడ్డీతో అప్పులు తెచ్చారని అన్నారు. మేడిగడ్డకు కేసీఆర్ వస్తానంటే స్వాగతిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

కాగా, మేడిగడ్డ విషయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమపై బురదచల్లడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మేడిగడ్డపై నిగ్గుతేల్చి తీరతామని రాష్ట్ర మంత్రులు చెబుతున్నారు.

రాజ్యసభకు అనిల్ కుమార్ యాదవ్, రేణుక.. చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్, ఎవరీ అనిల్ కుమార్ యాదవ్