Uttam Kumar Reddy : టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కు కరోనా పాజిటివ్

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారం ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. రాజకీయ నాయకులు ఒక్కొక్కరు కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

Uttam Kumar Reddy : టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కు కరోనా పాజిటివ్

Uttam Kumar Reddy Test Positive For Covid 19 (1)

Updated On : April 24, 2021 / 7:46 PM IST

Uttam Kumar Reddy test positive for Covid-19 : నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారం ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. రాజకీయ నాయకులు ఒక్కొక్కరు కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కొండాపూర్ ఏఐజీ ఆస్పత్రిలో ఉత్తమ్ కు చికిత్స పొందుతున్నారు. ఉత్తమ్ కు కరోనా స్వల్ప లక్షణాలు ఉండటంతో వైద్యుల సూచన మేరకు ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం.

అయితే, సాగర్ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి తరపున ఉత్తమ్ ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌తో పాటు టీఆర్ఎస్ స్థానిక నేతలు కోటిరెడ్డి, అంజయ్య యాదవ్ కరోనా వైరస్ బారిన పడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.

కేసీఆర్ కూడా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచార సభలో ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణలో 7432 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 3.87 లక్షల మార్కును దాటింది.