Vaccine Stocks : తెలంగాణలో ఖాళీ అవుతున్న టీకా నిల్వలు

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్‌ నిల్వలు అయిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న నిల్వలు ఇవాళ సాయంత్రానికి ఖాళీ అవ్వనున్నాయి.

Vaccine Stocks : తెలంగాణలో ఖాళీ అవుతున్న టీకా నిల్వలు

Vaccine Stocks Being Depleted In Telangana

Updated On : April 17, 2021 / 4:52 PM IST

Vaccine stocks being depleted : తెలంగాణలో కరోనా వ్యాక్సిన్‌ నిల్వలు అయిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న నిల్వలు ఇవాళ సాయంత్రానికి ఖాళీ అవ్వనున్నాయి. ఇవాళ రాత్రి వరకు 2 లక్షల 70 వేల డోసులు పంపుతామని రాష్ట్రానికి కేంద్రం సమాచారం ఇచ్చింది. అవి అందకపోతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిలిచిపోనుంది.

ఇప్పటికే గ్రేటర్‌ పరిధిలోని కొన్ని కేంద్రాల్లో టీకా డోసులు అయిపోయాయి. గత ఐదు రోజుల్లోనే ఏకంగా 6 లక్షల 23 వేల మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. రోజూ సగటున లక్షా 27 వేల మంది టీకా తీసుకున్నారు. కొవిడ్‌ కేసులు వాయు వేగంతో పెరుగుతుండటంతో టీకాల కోసం క్యూ కట్టే వారి సంఖ్య అనుహ్యంగా పెరిగింది.

దీంతో కేంద్రం పంపిన నిల్వలు రోజుల వ్యవధిలోనే కరిగిపోయాయి. రోజు వారీ డిమాండ్‌ కూడా ఒకటి రెండు రోజుల్లోనే రెండు లక్షలకు చేరేలా కనిపిస్తోంది.