Vasant Panchami : భక్త జన సంద్రంగా మారిన బాసర పుణ్యక్షేత్రం.. చిన్నారులకు అక్షరాభ్యాసం
అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే ప్రయోజకులవుతారనే నమ్మకంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

Vasant Panchami 2024
Basara Temple : నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి జన్మదినం మూలా నక్షత్రం, వసంత పంచమి సందర్భంగా తెల్లవారు జాము 1 గంటల నుంచే అమ్మవారి దర్శనంకోసం భక్తులు క్యూలైన్ లలో వేచిఉన్నారు. వేకువ జామున 1:30 గంటలకు అమ్మవారికి మంగళ వాయిద్య సేవ, అష్టోత్తర శత పూజ, 108 కలశ జలములతో అభిషేకం, మహా హారతిని ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించారు.
Also Read : Road Safety : వణుకు పుట్టించే వీడియో షేర్ చేసిన వీసీ సజ్జనార్.. కారు డోర్ తీసేటప్పుడు జాగ్రత్త..
పద్మశాలి సంఘం తరపున అందజేసిన చేనేత పట్టువస్త్రాలతో అమ్మవారిని ఆలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేక సేవలో మథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు. వసంత పంచమి సందర్బంగా ఉదయం మూడు గంటల నుండి చిన్నారులకు అమ్మవారి చెంత అక్షర శ్రీకార పూజలు ప్రారంభమైంది. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే ప్రయోజకులవుతారనే నమ్మకంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
Also Read : మీరు నిజాయితీపరులే అయితే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఎదురుదాడి
క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అసెంబ్లీ సెషన్స్ కారణంగా పట్టు వస్త్రాల సమర్పణకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రావటం లేదని అధికార వర్గాలు తెలిపాయి. తొమ్మిది గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అదిలాబాద్ ఎంపి సోయం బాపూరావు, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే రామారావ్ పవార్ లు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.