మీరు నిజాయితీపరులే అయితే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఎదురుదాడి

కేసీఆర్ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాశీకి పోయి సన్యాసం పుచ్చుకోవాల్సిందే.

మీరు నిజాయితీపరులే అయితే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఎదురుదాడి

CM Revanth Reddy

CM Revanth Reddy : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చలో నల్గొండ సభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేసీఆర్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు రేవంత్ రెడ్డి. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

”నల్గొండ సభలో కేసీఆర్ సుద్ద పూసలా, సత్య హరిశ్చంద్రుడిలా మాట్లాడారు. మీరు నిజాయితీపరుడే అయితే అసెంబ్లీలో చర్చకు ఎందుకు రాలేదు? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి నుండి దృష్టి మరల్చడం కోసమే KRMB వివాదాన్ని తెరపైకి తెచ్చారు. శాసనసభకు రావడానికి కాలు విరిగిందని సాకులు చెప్పారు. నల్గొండ సభకు ఎలా వెళ్లారు..? నల్గొండ దగ్గర ఉందా..? శాసనసభ దగ్గరుందా..? మీరు నిజాయితీపరుడని తెలంగాణ సమాజం భావించడం లేదు. మీ దోపిడీ వల్ల మేడిగడ్డ బలైంది. అన్నారం, సుందిల్ల సున్నం అయ్యాయి.

రేపు ఉదయం అసెంబ్లీకి రండి. స్వార్ధం వీడి.. ప్రతిపక్ష నాయకుడి హోదాను గౌరవంగా నిర్వర్తించండి. హరీశ్ రావు లాంటి వారికి ఆ పార్టీలో విలువ లేదు. అందుకే అసెంబ్లీకి కేసీఆర్ రావాలని కోరాం. నల్గొండ సభలో దిక్కుమాలిన మాటలు మాట్లాడిన మీరు సభకు ఎందుకు రాలేదు? మమ్మల్ని బెదిరించి బతకాలని చూస్తున్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిలో మీకు భాగస్వామ్యం లేకపోతే ఎందుకు ముఖం చాటేస్తున్నారు? కాళేశ్వరం అవినీతిపై చర్చను తప్పుదారి పట్టించడం కోసమే నల్గొండలో సభ పెట్టారు.

Also Read : హరీశ్ రావుకి మంత్రి పదవి ఇస్తాం- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ కుర్చీ పోగానే నీళ్ళు, ఫ్లోరైడ్ గుర్తుకు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి పై బాధ్యతరాహిత్యంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ కచ్చితంగా రేపటి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి. ఎవరికీ భయపడ అంటున్న మీరు ఎందుకు సభకు రావడం లేదు? Krmbపై మీ అనుభవాన్ని తెలపాలి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని కొత్త డ్రామాలు మొదలు పెట్టారు. మిమ్మల్ని దించి 60 రోజుల కాలేదు అప్పుడే అడుక్కునే పని మొదలు పెట్టారు.

కేసీఆర్ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాశీకి పోయి సన్యాసం పుచ్చుకోవాల్సిందే. వాళ్ల చీకటి మిత్రులు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఎవరూ రాలేదు. బీజేపీ ఎమ్మెల్యేలు వస్తారనుకున్నాం. మీ ఇద్దరి నైజం ఒక్కటే. బీజేపీ.. కేసీఆర్ అవినీతిని నిలదీస్తారా..? కాపాడతారా..?” అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు.

”కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవకతవకలు జరిగాయి. ఒక్క మేడిగడ్డలో 1800 కోట్లు అయితే 4వేల 500 కోట్లు ఖర్చు చేశారు. రీ-డిజైన్ తో వేల కోట్ల దోపిడీపై అసెంబ్లీలో చర్చ జరిగింది. Krmb కి కాంగ్రెస్ అప్ప చెప్పిందని కేసీఆర్ అబద్ధం చెబుతున్నారు. కేసీఆర్ మేడిగడ్డకు రావాలని నేనే కోరాను. కేసీఆర్.. మీకు వీలుకాకపోతే.. మరో తేదీ చెప్పాలని అడిగాం. కాలు విరిగిన కేసీఆర్ నల్గొండకు వెళ్లారు. దగ్గరున్న అసెంబ్లీకి ఎందుకు రావు? మీ దోపిడీకి మేడిగడ్డ బలైంది. కేసీఆర్ లక్ష కోట్ల దోపిడీకి కాళేశ్వరం బలైంది.

అసెంబ్లీకి వచ్చి.. అఖిలపక్షం పెట్టండని చెప్పొచ్చుగా. మాది ప్రజా ప్రభుత్వం. మీలా మంది పిల్లలను చంపి అధికారంలోకి రాలేదు. కాళేశ్వరం అవినీతిలో భాగం లేకపోతే.. ఎందుకు మాట్లాడటం లేదు..? అసెంబ్లీకి ఎందుకు ముఖం చాటేశారు? మీ గౌరవాన్ని తగ్గించం.. అసెంబ్లీకి రండి.. సూచనలు ఇవ్వండి.

Krmb పాపాలకు కారణం కేసీఆర్. నీళ్ళు నింపితే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా కుప్పకూలిపోతాయి. రేపు సభకు రండి.. సాగునీటి ప్రాజెక్టులపై చర్చలో పాల్గొనండి. కాళేశ్వరంలో వేల కోట్ల దోపిడీకి ఎల్ అండ్ టీని శిక్షించాలా? వద్దా? కాళేశ్వరం అవినీతిపై మీ వైఖరి ఏంటో చెప్పాలి. కుర్చీ పోయింది కాబట్టి.. నేను అవిటి వాడినని సానుభూతి కోసం నల్గొండ వెళ్లారు. 60 రోజులు కాలేదు. అప్పుడే కేసీఆర్ అడుక్కుంటున్నారు. నల్గొండకు పోతున్నావు.. అసెంబ్లీకి ఎందుకు రావు? సభకు పాలమూరు నుండి జనం తీసుకెళ్లారు.

Also Read : కృష్ణా జలాలు మనకు జీవన్మరణ సమస్య, పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారు- కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

కేసీఆర్ కుట్రలు కుతంత్రాలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలి. బీజేపీ ఎమ్మెల్యేలు రాకుండా.. కిషన్ రెడ్డి అడ్డుకున్నారు బీజేపీ, బీఆర్ఎస్ ది చీకటి ఒప్పందం. స్పీకర్ ఆదేశంతో ఏర్పాటు చేసింది కాళేశ్వరం టూర్. కేసీఆర్ అవినీతిపై బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలి” అని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.