ఇదెక్కడి పిచ్చి.. పాపులారిటీ కోసం ఇలా చేయాలా..? వీసీ సజ్జనార్ ట్వీట్ వైరల్

ఓ మహిళ బావి గోడపై కూర్చొని చిన్నపిల్లవాడితో కలిసి ప్రమాదకరమైన వీడియోను చిత్రీకరించింది. బావి గోడ అంచున కూర్చున్న మహిళ సుమారు రెండు మూడేళ్ల వయస్సు కలిగిన ..

ఇదెక్కడి పిచ్చి.. పాపులారిటీ కోసం ఇలా చేయాలా..? వీసీ సజ్జనార్ ట్వీట్ వైరల్

viral video

Updated On : September 22, 2024 / 2:03 PM IST

VC Sajjanar : సోషల్ మీడియా అనేది ప్రజల జీవితాల్లో ప్రస్తుతం ఓ భాగం అయిపోయింది. చిన్నా, పెద్దా అనే తేడాలేకుండా అందరూ యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విటర్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. అధికశాతం మంది సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో వీడియోలు షేర్ చేయడం ద్వారా పాపులర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పిచ్చిచేష్టలకు పాల్పడుతున్నారు. వీడియోల చిత్రీకరణ సమయంలో ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ప్రమాదాల భారిన పడుతున్నారు. పలువురు మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి.

Also Read : Snake Video Viral : బాబోయ్.. ఈ భయంకరమైన పాము ఎలా ఎటాక్ చేస్తుందో చూడండి.. వీడియో వైరల్

తాజాగా.. ఓ మహిళ బావి గోడపై కూర్చొని చిన్నపిల్లవాడితో కలిసి ప్రమాదకరమైన వీడియోను చిత్రీకరించింది. బావి గోడ అంచున కూర్చున్న మహిళ సుమారు రెండు మూడేళ్ల వయస్సు కలిగిన పిల్లవాడిని బావి లోపలివైపుకు ఉంచి బాలుడు చేతిని పట్టుకొని ఉంది. ఆ వీడియోను సోషల్ మీడిలో షేర్ చేయగా.. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం పట్టుతప్పినా ఆ బాలుడు బావిలో పడటంతో పాటు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. బాలుడు ప్రాణాలను రిస్క్ లో పెడుతూ అలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేయడం ఏమిటని సదరు మహిళపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : IND vs BAN : పూజల ఫలితం దక్కిందోచ్..! బ్యాట్, హెల్మెంట్‌కు పంత్ పూజలు.. ఎందుకో తెలుసా?

తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఈ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఇదెక్కడి పిచ్చి.. సోషల్ మీడియాలో పాపులారిటీకోసం ఇలా పిల్లాడి ప్రాణాన్ని రిస్క్ లో పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. ఏమాత్రం తేడా వచ్చిన ఆ చిన్నారి ప్రాణాలకు ప్రమాదమనే కనీస సోయి లేదు. సోషల్ మీడియాకు బానిసలు కాకండి.. ఫేమస్ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు చేయకండి అంటూ సజ్జనార్ పేర్కొన్నారు.