Hyderabad : హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు అలర్ట్… ఆ ప్రాంతంలో వాహనాలకు దారి మళ్లింపు.. ఈ మార్గాల్లో వెళ్లండి..
Hyderabad : నేషనల్ హైవే- 65 (హైద్రాబాద్- విజయవాడ) పై చిట్యాల, పెద్ద కాపర్తి వద్ద ప్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున, ట్రాఫిక్ జామ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో వాహనాల మళ్లింపు చర్యలు చేపట్టారు.
Hyderabad Vijayawada National Highway
- హైదరాబాద్ వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు
- హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల వద్ద ప్లైఓవర్ నిర్మాణ పనులు
- ట్రాఫిక్ నివారణకు వాహనాలను దారిమళ్లింపు
Hyderabad : సంక్రాంతి పండుగ ముగియడంతో హైదరాబాద్ నుంచి ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన ప్రజలు మళ్లీ తిరుగుపయణం అయ్యారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ పెరగనుంది. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ట్రాఫిక్ రద్దీ నివారణకు హైదరాబాద్ వెళ్లే వాహనాలకు నల్గొండలో దారి మళ్లింపు చేపట్టినట్లు నల్గొండ జిల్లా
ఎస్పీ శత్ చంద్ర పవార్ తెలిపారు.
నేషనల్ హైవే- 65 (హైద్రాబాద్- విజయవాడ) పై చిట్యాల, పెద్ద కాపర్తి వద్ద ప్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున, ట్రాఫిక్ జామ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా, ప్రయాణికులకు సురక్షితమైన, సాఫీ ప్రయాణం కల్పించాలనే ఉద్దేశంతో నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ట్రాఫిక్ దారి మళ్లింపు చర్యలు చేపట్టింది.
వాహనాల దారి మళ్లింపు ఇలా..
♦ గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు : గుంటూరు, మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ వెళ్ళాలి.
♦ మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు : మాచర్ల, నాగార్జునసాగర్, పెద్దవూర, కొండపల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ వెళ్ళాలి.
♦ నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు : నల్లగొండ, మార్రిగూడ బైపాస్, మునుగోడు, నారాయణపూర్, చౌటుప్పల్ (ఎన్.హెచ్ 65) మీదుగా హైదరాబాద్ వెళ్ళాలి.
♦ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు : కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, హాలియా, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ వెళ్ళాలి.
♦ ఎన్‌హెచ్65 (విజయవాడ -హైదరాబాద్ )రహదారి పై చిట్యాల, పెద్దకాపర్తిలో ప్లై ఓవర్ నిర్మాణాలు జరుగుతున్నందున ట్రాఫిక్ జామ్ అయిన పక్షంలో చిట్యాల నుండి భువనగిరి గుండా హైద్రాబాద్ మళ్లించడం జరుగుతుందని తెలిపారు.
♦ ఈ మార్గాల ద్వారా వెళ్లడం వల్ల ప్రధాన రహదారి విజయవాడ, హైద్రాబాద్ పై (ఎన్‌హెచ్ 65 ) ట్రాఫిక్ సమస్య తగ్గి, ప్రయాణికులు గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చు నని ఎస్పీ పేర్కొన్నారు.
