Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ లోకి కొనసాగుతున్న వలసలు.. హస్తం గూటికి వేముల వీరేశం, మైనంపల్లి!

వేముల వీరేశం, మైనంపల్లి హన్మంత్ రావు ఇటీవలే బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ లోకి కొనసాగుతున్న వలసలు.. హస్తం గూటికి వేముల వీరేశం, మైనంపల్లి!

Telangana congress (2)

Telangana Congress – Veeresham – Mynampally : ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయం రసవత్తరగా మారింది. టికెట్ ఆశించి భంగపడిన అశావాహులు పార్టీలు మారుతున్నారు. పార్టీలు, జెండాలు, కండువాలు మార్చుతున్నారు. ఇతర పార్టీల్లోకి జంపు అవుతున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ నుంచి వలసలు ఎక్కువయ్యాయి. టికెట్ దక్కని కొంతమంది నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మరికొందరు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి.

మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ లో చేరనున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఏఐసీసీ నేతల పిలుపుతో ఆయన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సహా అక్కడే ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సమావేశం కాబోతున్నారు. ఆ తర్వాత లాంఛనంగా కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి. నకిరేకల్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఖరారయ్యే అవకాశం ఉంది.

Mynampally Hanumanth Rao : అందుకే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాను : మైనంపల్లి

మరోవైపు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు సైతం త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ గూటికి చేరునున్నారు. మైనంపల్లి హనుమంత్ రావు రెండు, మూడు రోజుల్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. జాతీయ నేతల సమమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మైనంపల్లి తనకు ఎనిమిది సీట్లు కావాలని కాంగ్రెస్ ఎదుట ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది.

మైనంపల్లి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తనపై కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని, అందుకే బీఆర్ఎస్ కు రాజీనామా చేశారని పేర్కొన్నారు. కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు మైనంపల్లి ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ లో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని అన్నారు. తన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు.

Revanth Reddy : బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. ఒప్పందం ప్రకారం కవితను అరెస్ట్ చేసి రెండు నెలల్లో విడుదల చేస్తారు : రేవంత్ రెడ్డి

కేసులకు ఎవ్వరూ భయపడే అవసరం లేదన్నారు. తన కార్యకర్తలు అయోమయంలో ఉన్నారని పేర్కొన్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు. మైనంపల్లి ఎవ్వరికీ భయపడడని పేర్కొన్నారు. పార్టీలో అందరికీ అవే నిబంధనలు ఉండాలన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం.. ఇదెక్కడి పద్ధతి అని నిలదీశారు. తాను పార్టీకి విధేయుడిగా పని చేశాను… ఏ పార్టీలో ఉన్న తన తీరు అంతేనని అన్నారు.

మెదక్ నియోజకవర్గంకి అన్ని విధాలా అందరం కలిసి అభివృద్ధి చేద్దామని పిలుపు ఇచ్చారు. మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత ఇస్తానని చెప్పారు. పార్టీ అధినేతతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. బీఆర్ఎస్ లో సర్వేల ప్రకారం టికెట్ ల కేటాయింపు జరుగలేదని విమర్శించారు. తనను టార్గెట్ చేస్తేనే… వారిని టార్గెట్ చేస్తానని హెచ్చరించారు.