Telangana : డబ్బులు ఎగ్గొట్టి పరారైన చిట్టీల వ్యాపారి..‘ఈ వ్యక్తి ఆచూకీ చెబితే రూ.3లక్షలు బహుమతి’ అంటూ ఫ్లెక్సీలు పెట్టిన బాధిత మహిళలు

డబ్బులు ఎగ్గొట్టి పరారైన చిట్టీల వ్యాపారిని నడిరోడ్డుమీద నిలబెట్టారు బాధిత మహిళలు. చిట్టీల వ్యాపారి ఫోటోతో ఫ్లెక్సీలు తయారు చేసిన రోడ్లపై ఏర్పాటు చేశారు...‘ఈ వ్యక్తి ఆచూకీ చెబితే రూ.3లక్షలు బహుమతి’ అంటూ జగిత్యాల రోడ్లపై ఫ్లెక్సీలు పెట్టారు బాధిత మహిళలు

Telangana : డబ్బులు ఎగ్గొట్టి పరారైన చిట్టీల వ్యాపారి..‘ఈ వ్యక్తి ఆచూకీ చెబితే రూ.3లక్షలు బహుమతి’ అంటూ ఫ్లెక్సీలు పెట్టిన బాధిత మహిళలు

Victimized womens who set up flexi in jagityal with chits cheater's photo

Updated On : January 4, 2023 / 4:28 PM IST

Telangana :  చిట్టీల పేరుతో ఎన్ని మోసాలు జరిగినా ఎన్ని దోపిడీలు జరిగినా మహిళలు మాత్రం చిట్టీలు కట్టటం మానరు. రూపాయి రూపాయి పొదుపు చేసుకుని ఇంట్లో ఏదోక ఖర్చుకు అక్కరకు వస్తుందనే ఆశతో చిట్టీలు కడుతుంటారు. కానీ చాలా ప్రాంతాల్లో చిట్టీల పేరుతో మోసం చేసిన డబ్బులతో ఉడాయించిన ఘటనలు జరుగుతునే ఉన్నాయి. ఈ మోసాలకు బలి అయిపోయిన మహిళకు కొంతకాలం బాధపడతారు..తరువాత ఏమీ చేయాలేక బాధతపడుతుంటారు. కొంతమంది ధైర్యంచేసిన పోలీసులకు ఫిర్యాదు చేస్తారు.

కానీ జగిత్యాల జిల్లాలోని గోవిందు పల్లె మహిళలు ఊరుకోలేదు. తమను మోసం చేసిన వ్యక్తిని నడిబజారులో పరువు తీయాలనుకున్నారు. దాని కోసం తమ వద్ద చిట్టీలు కట్టించుకుని డబ్బులతో పరారైన ‘గాండ్ల వెంకన్న’ అనే వ్యక్తి ఫోటోలతో ఫ్లెక్సీలు తయారు చేసిన జగిత్యాలలో రోడ్లమీద ఏర్పాటుచేశారు. గాండ్ల వెంకన్న అనే వ్యక్తి కనబడుటలేదు అని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. పై ఫోటోలోని వ్యక్త పేరు గాండ్ల వెంకన్న ఈ వ్యక్తి పెద్ద మొత్తంలో డ్బుబలు తీసుకుని కుటుంబంతో సహా పరార్ అయ్యాడు. ఆచూకి తెలిపినవారికి రూ.3 లక్షలు బహుమతి ఇస్తాం అంటూ ప్రకటించారు బాధిత మహిళలు. ఫ్లెక్సీలో బాధిత మహిళల ఫోన్ నంబర్లు కూడా ప్రింట్ చేయించారు. ఈ వ్యక్తి ఆచూకి తెలిస్తే ఈ నంబర్లకు ఫోన్ చేయమని కోరు వారి ఫోన్ నంబర్లు ముద్రించారు. ఫోన్ చేయండీ రూ.3లక్షలు గెలుచుకోండి అంటూ రాయించారు ఫ్లెక్సీలో..