Vijayashanti: అందుకే అక్కడి నుంచి వచ్చేశా.. బీజేపీలో హీట్‌ పుట్టిస్తున్న విజయశాంతి ట్వీట్‌..

అక్కడ ఉండటం తనకు అసౌకర్యం, అసాధ్యమని విజయశాంతి అన్నారు.

Vijayashanti: అందుకే అక్కడి నుంచి వచ్చేశా.. బీజేపీలో హీట్‌ పుట్టిస్తున్న విజయశాంతి ట్వీట్‌..

Vijayashanti

Updated On : July 21, 2023 / 7:59 PM IST

Vijayashanti – BJP: బీజేపీ తెలంగాణ (Telangana) నాయకురాలు విజయశాంతి ఇవాళ చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ (Hyderabad) నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఇవాళ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

దీని గురించి విజయశాంతి ట్వీట్ చేశారు. ” బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుండగా మధ్యలో ఎందుకు వచ్చేశానని పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు. అది సరికాదు. కిషన్ రెడ్డిని అభినందించి, శుభాశీస్సులు తెలియచేసిన తరువాతే వచ్చాను.

అయితే, అప్పట్లో తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణ వాదాన్ని ఉక్కుపాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించిన వారు ఎవ్వరైనా ఉన్న సందర్భంలో, అక్కడ ఉండటం నాకు అసౌకర్యం, అసాధ్యం. ఆ పరిస్థితి వల్ల ముందుగానే వెళ్లవలసి వచ్చింది.. జై శ్రీరామ్. హర హర మహాదేవ.. జై తెలంగాణ ” అని పేర్కొన్నారు.

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించే విజయశాంతి ట్వీట్ చేశారని ప్రచారం జరుగుతోంది. కిషన్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

Jubilee Hills Constituency: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ టికెట్ ఈసారి ఎవరికి.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎవరు?