Minister KTR : ఈ గవర్నెన్స్ ద్వారా పారదర్శకంగా సేవలు అందిస్తున్నాం : మంత్రి కేటీఆర్
డిజిటల్ చెల్లింపులకు సంబంధించి టి వ్యాలెట్ ప్రత్యేక ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు. టి వ్యాలెట్ ద్వారా ఎక్కడి నుండైన చెల్లింపులు చేసుకోవచ్చన్నారు.

Ktr
E-governance seminar : సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ గవర్నెన్స్ సదస్సులో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సాంకేతిక పరిజ్ఞానం పై ప్రత్యేక దృష్టి పెట్టారని వెల్లడించారు. ఈ గవర్నెన్స్ ద్వారా పారదర్శకంగా సేవలు అందిస్తున్నామని తెలిపారు. దేశంలోనే ఉత్తమ సేవలు అందిస్తున్న సంస్థ మీ సేవ అని కొనియాడారు. రోజుకు లక్ష మంది వినియోగదారులు మీ సేవను ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు.
డిజిటల్ చెల్లింపులకు సంబంధించి టి వ్యాలెట్ ప్రత్యేక ఏర్పాటు చేశామని చప్పారు. టి వ్యాలెట్ ద్వారా ఎక్కడి నుండైన చెల్లింపులు చేసుకోవచ్చన్నారు. టి యాప్ పోలియో ప్రతి పౌరుడు వాడుకొనేలా రూపొందించామని చెప్పారు. టి యాప్ పోలియో ద్వారా 10 వేల లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ టెక్నాలజీ ఎప్పటి నుండో వాడుతుందని చెప్పారు.
Drugs Case : హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. జాబితాలో ప్రముఖులు, వారి పిల్లలు
పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర సేవలను ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చన్నారు. పెన్షనర్ లైఫ్ సర్టిఫికెట్ కూడా మీ సేవ కేంద్రాల ద్వారా లేదా టీ యాప్ పోలియో ద్వారా సెల్ఫీ తీసి అప్లై చేసుకోవచ్చని తెలిపారు. ట్రాన్స్ స్పోర్ట్ శాఖ లో 17 సర్వీస్ లు ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయని.. మొబైల్ ఫోన్ ఉంటే చాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సేవలు అందించేందుకు టి ఫైబర్ పేరు లాంచ్ చేశామని గుర్తు చేశారు.
వ్యవసాయ రంగంకు కూడా ఈ గవర్నెన్స్ వాడుతున్నామని పేర్కొన్నారు. డ్రోన్ ద్వారా దేశంలోనే మొదటి సారి ఔషధాల సరఫరా చేసిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అని కొనియాడారు. 2012-13లో ఐటి ఐఆర్ ను హైదరాబాద్ కు ప్రకటించారని తెలిపారు. ఇప్పటివరకు ఐటి ఐఆర్ ఇవ్వలేదని.. ఇప్పటికైనా ఐటి ఐఆర్ ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు.
Sexually Assaulted : హైదరాబాద్ ఉప్పల్‌లో దారుణం.. నాలుగేళ్ల కొడుకుపై తండ్రి లైంగిక వేధింపులు
ఐటి రంగంలో తెలంగాణ దేశంలోనే ముందు వరుసలో ఉందన్నారు. ఈ గవర్నెన్స్ లో దేశంలోనే రాష్ట్రం ముందు ఉందని తెలిపారు. ఎలక్ట్రానిక్ మంఫ్యాక్చర్ క్లస్టర్ ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఏరో స్పెస్ లో కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి.. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్కటి అహ్మదాబాద్, మరోటి కర్ణాటక రాష్ట్రాలకు ఇచ్చారని పేర్కొన్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో స్పెస్ రంగానికి సంబంధించి మంత్రి కేటీఆర్ అడిగారు దానికి సహకరిస్తామని చెప్పారు. స్టార్టప్ లకు తెలంగాణ వేదిక అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ లో కూడా ఈ గవర్నెన్స్ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.