Weather forecast : తెలంగాణలో పెరుగుతున్నపగటి ఉష్ణోగ్రతలు

రాగల మూడు రోజులు తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. వచ్చే ఐదురోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

Weather forecast : తెలంగాణలో పెరుగుతున్నపగటి ఉష్ణోగ్రతలు

weather forecast

Updated On : March 28, 2022 / 2:45 PM IST

Weather forecast :  రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్నాయి. క్రమేపి పగటి ఉష్ణోగ్రతలలో మార్పు కనిపిస్తోంది. మరోవైపు విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉన్న ఉపరి తల ద్రోణి ఈరోజు విదర్భనుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదగా ఉత్తర కేరళ వరకు సగటు సముద్ర మట్టం నుండి సుమారు 0.9  కిమి ఎత్తు వరకు కొనసాగుతోందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

రాగల మూడు రోజులు తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. వచ్చే ఐదురోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు అక్కడక్కడ పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఎండకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Also Read : Yadadri: ఆరేళ్ల ఎదురుచూపులు ఫలించిన వేళ.. యాదాద్రీశుడి నిజ రూప దర్శనం పునః ప్రారంభం