తెలంగాణకు బిగ్ వెదర్ అలర్ట్.. రెండు రోజులు ఆరెంజ్ అలర్ట్.. ఆ తర్వాత రెండు రోజులు..

హైదరాబాద్‌లో కూడా భారీ వాన పడింది.

తెలంగాణకు బిగ్ వెదర్ అలర్ట్.. రెండు రోజులు ఆరెంజ్ అలర్ట్.. ఆ తర్వాత రెండు రోజులు..

Rains

Updated On : May 28, 2025 / 10:03 AM IST

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు ఆరెంజ్​ అలర్ట్, ఆ తదుపరి రెండు రోజులకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ). తెలంగాణలో ఈ నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని చెప్పింది.

ఇటీవలే ప్రవేశించిన రుతుపవనాల చురుగ్గా కదులుతున్నాయని ఐఎండీ పేర్కొంది. నిన్న మహబూబ్​నగర్​ జిల్లా వరకు విస్తరించాయని చెప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడిందని, దీని ప్రభావం తెలంగాణపై అంతగా ఉండదని తెలిపింది.

Also Read: సన్‌రైజర్స్‌ హైదరాబాద్ యాజమాన్యంపై హెచ్‌సీఏ ఒత్తిడి తెచ్చి, తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది: విజిలెన్స్ నివేదిక

తెలంగాణలో ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఆ తదుపరి రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. హైదరాబాద్ సహా తెలంగాణలోని అనేక జిల్లాల్లో గంటకు 50 – 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 5 – 7 డిగ్రీలు తగ్గే ఛాన్స్ ఉందని తెలిపింది.

తెలంగాణలో ఈ సారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు చెప్పింది. కాగా, నిన్న తెలంగాణలోని కరీంనగర్​ జిల్లా ఖాసింపేటలో అత్యధికంగా11.4 సె.మీ వర్షపాతం నమోదైంది. నిన్న హైదరాబాద్‌లో కూడా భారీ వాన పడింది. గత రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు వర్షం పడింది.

సికింద్రాబాద్, అత్యధికంగా రామచంద్రాపురంలో 5.5 సె.మీ. వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లోని సూరారం కాలనీలో పద్మారావు అనే వ్యక్తి ఇంట్లోకి భారీగా వరద నీరు చేరింది. పద్మారావు ఆ సమయంలో బాగా మద్యం తాగి ఉండడంతో నీళ్లలోనే మునిగి చనిపోయాడు.