వాతావరణం: బంగాళాఖాతంలో అల్పపీడనం

  • Published By: chvmurthy ,Published On : January 29, 2019 / 04:02 PM IST
వాతావరణం: బంగాళాఖాతంలో అల్పపీడనం

Updated On : January 29, 2019 / 4:02 PM IST

హైదరాబాద్: హిందూ మహాసముద్రం, అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఆవరించి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర దిశ, ఈశాన్య దిశల నుంచి ఈదురు గాలులు వీస్తుండటంతో  రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణశాఖ అధికారులు  చెప్పారు. 

బుధవారం రాష్ట్రంలో  కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ఉష్ణోగ్రత సాధారణం కన్నా మూడు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని అధికారులు  తెలిపారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా తెల్లవారు ఝూమున పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నందున వాహానదారులు రహాదారులపై అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.