Kishan Reddy : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఎస్టీ రిజర్వేషన్లు పెంపు : కిషన్ రెడ్డి

కావాలని ముస్లిం రిజర్వేషన్లకు జోడించి ఎస్టీ రిజర్వేషన్లు కాకుండా గత తొమ్మిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీలకు అన్యాయం చేసిందని విమర్శించారు.

Kishan Reddy : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఎస్టీ రిజర్వేషన్లు పెంపు : కిషన్ రెడ్డి

Kishan Reddy key comments

Updated On : July 30, 2023 / 3:40 PM IST

Kishan Reddy – Warangal Visit : వరంగల్ పర్యటనలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కీలక వ్యాఖ్యలు చేశారు. లంబాడీల విషయంలో ఎంపీ సోయం బాబురావు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని చెప్పారు. సోయం బాబురావు చేసిన వ్యాఖ్యలతో తాము ఏకీభవించబోమని స్పష్టం చేశారు. ఆదివారం వరంగల్ లోని వరద ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఎస్టీ రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం చేస్తామన్నారు. అవసరమైతే ముందే ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతామని చెప్పారు. పార్లమెంట్ ప్రమేయం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ ద్వారా చేయవచ్చని తెలిపారు.

Narayana Brother Mani React : మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియ ఆరోపణలు.. ఆమె వ్యాఖ్యలపై స్పందించిన భర్త మణి

జనాభా ప్రాతిపదికన రాజ్యాంగంలో పొందుపర్చిన విధంగా  ఎస్టీ రిజర్వేషన్లు పెంచే వీలుందని వెల్లడించారు. కావాలని ముస్లిం రిజర్వేషన్లకు జోడించి ఎస్టీ రిజర్వేషన్లు కాకుండా గత తొమ్మిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం ఎస్టీలకు చేసిందని విమర్శించారు.