CM Revanth Reddy: అరెస్ట్ రివేంజ్‌ తప్పదా.. రేవంత్ ప్లాన్ అదేనా?

విద్యుత్ కొనుగోళ్ల అంశంలో మాజీ సీఎం కేసీఆర్, కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌తో పాటు హరీశ్‌ రావు, ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ పేర్లు ఉన్నాయి.

CM Revanth Reddy: అరెస్ట్ రివేంజ్‌ తప్పదా.. రేవంత్ ప్లాన్ అదేనా?

Updated On : March 28, 2025 / 8:35 PM IST

కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైలులో డబుల్‌బెడ్రూం ఇల్లు గ్యారెంటీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పేవారు. ఎప్పుడు మైక్ పట్టుకున్నా.. ఏ సభకు వెళ్లినా ఇదే డైలాగ్‌ రిపీటెడ్‌గా వినిపించేవారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు రిపీట్ చేయడం వెనుక మతలబ్‌ ఏంటి? చర్లపల్లి జైల్లో గడిపిన నాటి రోజుల్ని అసెంబ్లీ సాక్షిగా ఎందుకు గుర్తుచేశారు.. బీఆర్‌ఎస్ బడా నేతల్ని జైల్‌కి పంపిస్తానని సీఎం పరోక్షంగా వార్నింగ్‌ ఇచ్చారా..?

రాజకీయంలో రివెంజ్‌లు ఓ రేంజ్ మజా ఇస్తుంటాయి. ప్రత్యర్థులు ఇచ్చిన దానిని తిరిగి వడ్డీతో ఇచ్చేస్తే ఆ కిక్కు వేరుగా ఉంటుందని నేతలు ఫీలవుతుంటారు. అయితే అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి తన అరెస్ట్, జైలు జీవితం గురించి ప్రస్తావించడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15నెలల తర్వాత తన అరెస్ట్ అంశాన్ని రేవంత్ ప్రస్తావించడంతో రివెంజ్ పాలిటిక్స్ తెరపైకి వచ్చాయి.

రేవంత్ కామెంట్స్ వెనుక భారీ వ్యూహమే కనిపిస్తుందనే చర్చ.. పొలిటికల్ సర్కిళ్లలో మొదలైంది. కేటీఆర్‌ ఫాంహౌస్‌పై డ్రోన్ ఎగరవేశానని తనపై తప్పుడు కేసులు పెట్టి 16రోజులు జైల్లో పెట్టారని చెప్పుకొచ్చారు. తన బిడ్డ పెళ్లి చూడకుండా చేశారని భావోద్వేగానికి గురయ్యారు. నక్సలైట్లు, ISI తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్‌‌‌‌‌‌‌‌లో తనను ఉంచినా.. తనకు కక్షసాధింపు లేదని చెబుతూనే ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్‌ ఇచ్చారనే టాక్ పొలిటికల్‌ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది.

Also Read: పంచాంగాన్ని ఎందుకు వినాలి? విశ్వావసు నామ సంవత్సరం అనే పేరు ఎలా వచ్చింది?

ఇలా నిండు సభలో చర్లపల్లి జైల్లో గడిపిన రోజులను పూసగుచ్చినట్లు వివరించడం వెనుక ఆంతర్యమేంటనే డౌట్‌.. బిగ్‌ డిబెట్‌ పాయింట్‌గా మారింది. ఇదే సమయంలో విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ తుదిదశకు చేరుకుందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చుతున్నాయి.

విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని, వేలకోట్ల రూపాయలు చేతులు మారాయని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఆరోపిస్తూ వస్తోంది. విచారణ తుది దశకు చేరడంతో రిపోర్టులు రెడీ చేసే పనిలో ఉన్నాయి కమిషన్స్.. ఆ నివేదికల ఆధారంగా కొన్ని అరెస్టులు జరగొచ్చు.. అందుకే కేసీఆర్, కేటీఆర్‌ అరెస్ట్ తప్పదని రేవంత్ చిన్న హింట్‌ ఇచ్చారనే టాక్‌ వినిపిస్తోంది.

తనను అన్యాయంగా జైలుకు పంపినా కక్ష్య పూరిత రాజకీయాలను పాల్పడలేదని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. అవినీతి విషయంలో మాత్రం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. అందుకే చర్లపల్లి జైల్లో ఎంత దుర్భరమైన రోజులు గడిపారో ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారని గుసుగుసలు మొదలయ్యాయి. అవినీతి కేసుల్లో బీఆర్ఎస్ పెద్దలు సైతం అదే జీవితాన్ని గడపాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించారనేది పొలిటికల్ సర్కిల్స్‌లో బిగ్‌సౌండ్ చేస్తున్న హాట్ డిబేట్..

విద్యుత్ కొనుగోళ్ల అంశంలో మాజీ సీఎం కేసీఆర్, కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌తో పాటు హరీశ్‌ రావు, ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ పేర్లు ఉన్నాయి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరును బట్టి చూస్తే త్వరలోనే రాష్ట్రంలో అరెస్టులు, విచారణలు వేగవంతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయనేది చర్చ.. మొత్తంగా సీఎం రేవంత్ కామెంట్స్‌తో తెలంగాణ రాజకీయాలు ఎండలను మించి హీటెక్కాయి.