Begumpet Airport : బేగంపేట విమానాశ్రయం..వింగ్స్ ఇండియా -2022 ఏవియేషన్ షో

హెలికాప్టర్ల ఫ్లై పాస్ట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండు రోజులు బిజినెస్‌ వర్గాలకు పరిమితం చేసిన ఎవియేషన్‌ షోను.. ఇవాళ, రేపు.. సాధారణ ప్రజలు సందర్శించేందుకు అనుమతిస్తారు.

Begumpet Airport : బేగంపేట విమానాశ్రయం..వింగ్స్ ఇండియా -2022 ఏవియేషన్ షో

Begumpet

Updated On : March 26, 2022 / 2:24 PM IST

Wings India-2022 Aviation Show : హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న వింగ్స్ ఇండియా -2022 ఏవియేషన్ షో అందరినీ ఆకర్షిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన అత్యాధునిక విమానాలు, హెలికాఫ్టర్లు, జెట్ ఫైటర్లు నగర వాసులకు కనువిందు చేస్తున్నాయి. ఈ ప్రదర్శనలో దాదాపు 200కు పైగా అంతర్జాతీయ సంస్థలు, ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు.

హెలికాప్టర్ల ఫ్లై పాస్ట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండు రోజులు బిజినెస్‌ వర్గాలకు పరిమితం చేసిన ఎవియేషన్‌ షోను.. ఇవాళ, రేపు.. సాధారణ ప్రజలు సందర్శించేందుకు అనుమతిస్తారు. చూడాలనుకునేవారి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Milan 2022 : INS విశాఖ నౌక జాతికి అంకితం.. అలరించిన యుద్ధ విన్యాసాలు

పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చేతుల మీదుగా ప్రారంభమైన ఏవియేషన్ షోలో.. వ్యాపార ఒప్పందాలు జోరుగా సాగుతున్నాయి. విమానం ఎలా నడుస్తుంది? అందుకు కావాల్సిన విడిభాగాలు మార్కెట్‌లో ఏయే ధరల్లో అందుబాటులో ఉంటాయి?

వాటి మరమ్మతులకు ఉపయోగించాల్సిన టెక్నాలజీ ఏమిటీ? డ్రోన్లను ఎలా ఉపయోగిస్తారు..? తదితర వ్యాపార అంశాలపై బిజినెస్‌ ఎగ్జిబిటర్లతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఈ ఏవియేషన్‌ షో రేపటితో ముగియనుంది.