Woman Died : అన్న మరణ వార్త విని గుండెపోటుతో చెల్లెలు మృతి
నిజామాబాద్ జిల్లా మోస్రా గ్రామంలో ఉన్న చెల్లెలు రంగుల పోచవ్వ(52)కు అన్న మరణ వార్త తెలియడంతో కన్నీటిపర్యంతమయ్యారు. ఏడూస్తూనే గుండెపోటుతో కుప్పకూలి చనిపోయారు.

woman died of heart attack (1)
Woman Died Of Heart Attack : జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరులో విషాదం నెలకొంది. అన్న మరణ వార్త విని చెల్లెలు గుండే ఆగిపోయింది. ఏడుస్తూ గుండెపోటుతో చెల్లెలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే రంగుల పోశాలు(60) బతుకుదెరువు కోసం 20 ఏళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా మోస్రా గ్రామం నుంచి వచ్చి కల్లూరు గ్రామంలో స్థిరపడ్డారు. కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కొన్ని రోజుల నుంచి రంగుల పోశాలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం రాత్రి మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా మోస్రా గ్రామంలో ఉన్న చెల్లెలు రంగుల పోచవ్వ(52)కు అన్న మరణ వార్త తెలియడంతో కన్నీటిపర్యంతమయ్యారు.
ఏడూస్తూనే గుండెపోటుతో కుప్పకూలి చనిపోయారు. అన్నాచెల్లెళ్ల మృతితో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పోశాలుకు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. పోచవ్వకు భర్త, ఇద్దరు కొడుకులు ఉన్నారు.