రెవెన్యూ అధికారిపై చెప్పుతో దాడి చేసిన మహిళా రైతు

women farmer attack revenue officer: ఆదిలాబాద్ జిల్లా తాంసిలో ధరణిపై నిర్వహించిన అవగాహన సదస్సు రసాభాసగా మారింది. రెవెన్యూ అధికారులపై మహిళా రైతులు దాడి చేశారు. వడ్డడికి చెందిన పలువురి భూములను తక్కువగా నమోదు చేశారని ఆరోపించారు.
దీనిపై రెండేళ్లుగా మొరపెట్టుకున్నా… అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతులతో అధికారులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఆగ్రహానికి లోనైనా మహిళా రైతులు అధికారులపై దాడి చేశారు.